Who Is Sania Javed? సానియా మిర్జాకు షోయబ్ తలాక్.. పాకిస్థాన్ మహిళతో మూడో పెళ్లి.. ఎవరీ సనా జావెద్?

ఇంటర్నేషనల్ స్థాయిలో, దాదాపు ఆసియాలోని అన్ని దేశాల మీడియాలో హెడ్‌లైన్‌గా మారి ట్రెండింగ్‌ అవుతున్న అంశం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానా జావెద్ పెళ్లి వ్యవహారం. టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాదీ వాసి సానియా మిర్జా‌కు తలాక్ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే షోయబ్ మూడోసారి పెళ్లి కొడుకు కావడం మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే సానియాతో దాంపత్య జీవితం నుంచి తెగతెంపులు చేసుకొన్న తర్వాత షోయబ్ పెళ్లి చేసుకొన్న సానా జావెద్ ఎవరనే విషయం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

గత కొద్ది రోజులుగా సానియా మిర్జా, షోయబ్ మాలిక్ విడాకుల వ్యవహారంపై మీడియాలో భారీ చర్చ, ఊహగానాలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి దాంపత్య జీవితం వైఫల్యం గురించి పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇస్తూనే షోయబ్ మాలిక్ మూడో పెళ్లి చేసుకోవడం వైరల్ అయింది.

Who Is Sania Javed? Cricketer Shoib Malik Third Marriage With Pakistan Actress after Divorce to Tennis Star Sania Mirza

ఇక పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను షోయబ్ మూడో పెళ్లి చేసుకోవడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే షోయబ్ మాలిక్‌కు ఇది మూడో వివాహం అయితే.. సనా జావెద్‌కు రెండో వివాహం. గతంలో ఉమేర్ జైస్వాల్ అనే అతడిని 2020లో సనా వివాహం చేసుకొన్నది. వారిద్దరి కాపురం మూడేళ్లు కొనసాగింది. ఆ తర్వాత 2023లో వారిదరూ విడాకులు తీసుకొన్నారు.

ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ యాక్టర్ సనా జావెద్‌, షోయబ్ మాలిక్‌కు పరిచయం ఓ టెలివిజన్ షోలో జరిగింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత కొద్ది రోజులు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. దాంతో సనా, షోయబ్ మత సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొన్నారు.

ఇక షోయబ్ మాలిక్‌తో పెళ్లి తర్వాత సనా మాలిక్‌గా మారిన సనా జావెద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం విషయానికి వస్తే.. ఉర్దూ టెలివిజన్‌లో సీరియల్ నటిగా కొనసాగారు. 2012లో షేర్ ఏ జాఫ్ అనే సీరియల్‌లో నటించడం ద్వారా వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించారు. ఖానీ అనే సీరియల్‌లో ఆమెకు మంచి పాపులారిటీని, గుర్తింపును తెచ్చిపెట్టింది.

Who Is Sania Javed? Cricketer Shoib Malik Third Marriage With Pakistan Actress after Divorce to Tennis Star Sania Mirza

సనా జావెద్ సినిమా రంగంలోకి 2013లో బేహాద్ అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఆ తర్వాత షారీక్ ఏ హయత్, దినో కి దుల్హనియా, ఐ లవ్ యూ రాజా అనే సినిమాల్లో నటించింది. 2012 నుంచి ఆమె దాదాపు 20 టెలివిజన్ సీరియల్స్‌లో నటించి మెప్పించింది. రుస్వాయి, డంక్ అనే సీరియల్స్‌ నటనకు గాను ఆమెకు పిసా అవార్డు లభించింది.

షోయబ్ మాలిక్‌తో సనా జావెద్ వివాహం తర్వాత భారీగా ట్రోల్సింగ్స్ కనిపించాయి. సానియా మిర్జాపై సానుభూతిని చూపిస్తూ షోయబ్‌ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దేశం నుంచి అనేక విమర్శలు, అవమానాలు భరించి పెళ్లి చేసుకొన్నందుకు సానియా మిర్జాకు చేసిన ద్రోహం క్షమించరానిది. ఇంతటి మోసం ఎవరికి జరుగకూడదు అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X