Who is Shyyamali De? సమంతతో రెండో పెళ్లి రూమర్లు.. రాజ్ నిడిమోరు మాజీ భార్య ఇన్స్‌టాగ్రామ్‌లో షాకింగ్ పోస్ట్

స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు అఫైర్, డేటింగ్ రూమర్లు జోరందుకొన్నాయి. వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి బయటి ప్రపంచానికి చెప్పడానికి సమంత నిర్మించిన శుభం సినిమా చక్కటి వేదికగా నిలిచింది. ఇద్దరి సెలబ్రిటీల కెమిస్ట్రీ ఈ సినిమా ప్రమోషన్స్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య నర్మగర్భంగా చేసిన ఓ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్ మరింత చర్చనీయాంశమైంది. రాజ్, సమంత డేటింగ్ రూమర్ల మధ్య ఒక్కసారిగా తెరపైకి వచ్చిన ష్యామలీ డే ఎవరనే వివరాల్లోకి వెళితే..

శ్యామలీ డే విషయానికి వస్తే.. సైకాలజీ స్టూడెంట్. ఆమె సినీ పరిశ్రమలోకి ప్రవేశించి ప్రముఖ దర్శకులు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ లాంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో శ్యామిలీతో రాజ్ నిడిమోరుకు పరిచయం కావడం.. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత వారిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2015 వివాహం చేసుకొన్నారు. వారిద్దరి కాపురం 7 ఏళ్లపాటు సవ్యంగా సాగింది. ఆ తర్వాత వారిమధ్య వైవాహిక బంధంలో అభిప్రాయ బేధాలు రావడంతో 2022 సంవత్సరంలో విడిపోయారు. అప్పటి నుంచి రాజ్, శ్యామలీ విడివిడిగా ఉంటున్నారు.

aj Nidimoru Ex Wife Shyyamali De Mystic Instagram Post

శ్యామలీ డే విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ నటించిన రంగ్ దే బసంతీ, సైఫ్ ఆలీ ఖాన్ నటించిన ఓంకారా, ఏక్ నోదిర్ గోల్పో లాంటి సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత రాజ్ నిడిమోరు, డీకే దర్శకత్వం వహించిన సినిమాలకు నటీనటులు ఎంపిక బాధ్యతను ఆమె తీసుకొన్నారు. అలా వారిద్దరి మధ్య పరిచయం దాంపత్య జీవితానికి దారి తీసిందని ఓ సందర్భంలో రాజ్ నిడిమోరు వెల్లడించారు. దాంపత్య జీవితంలో కలతలతో వారిద్దరూ విడిపోయిన తర్వాత ది ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగులో సమంతతో జరిగిన పరిచయం రాజ్ నిడిమోరు మధ్య అపైర్‌కు దారి తీసిందని మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే తాజాగా సమంత, రాజ్ నిడిమోరు కలిసి తిరగడం, పలు ఈవెంట్లకు హాజరవ్వడంతో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి బాహాటంగానే మాట్లాడుకోవడం మీడియా మొదలుపెట్టింది. ఈ మధ్యలో శుభం ప్రమోషనల్ ఈవెంట్స్, అలాగే తిరుపతి, కాళహస్తి లాంటి ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన నేపథ్యంలో వారిద్దరి ఆఫైర్ రూమర్లకు మరింత బలం చేకూరాయి. ఈ క్రమంలో సామ్, రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తల నేపథ్యంలో తన ఇన్స్‌టాగ్రామ్‌ అకౌంట్‌లో శ్యామలీ డే ఆసక్తికరమైన పోస్టు పెట్టారు.

శ్యామలీ డే తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో.. నా గురించి ఆలోచించే వారికి, చూడాలనే వారికి, నా గురించి వినాలనే వారికి, నా గురించి మాట్లాడే వారికి, నాతో మాట్లాడాలని ప్రయత్నించే వారికి, నా గురించి చదివే వారికి, నా గురించి రాసే వారికి, నన్ను కలువాలనుకొనే వారికి ప్రతీ ఒక్కరికి నా ప్రేమ, ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటాయి అంటూ భావోద్వేగమైన పోస్టును పెట్టారు. అయితే ఈ నర్మగర్భమైన పోస్టు వెనుక అర్ధం ఏమిటనే విషయం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X