Donald Trump జైలుకు పంపిన పోర్న్‌స్టార్.. ఎవరీ స్ట్రామీ డేనియల్స్? అరెస్ట్ వెనుక అసలు కథ ఇదే!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా మీడియాలో సంచలనంగా మారింది. పోర్న్ స్టార్‌తో శృంగారం జరిపి 130000 అమెరికన్ డాలర్లు ఇచ్చిన వ్యవహారం ట్రంప్ మెడకు చుట్టుకొన్నది. ఈ వ్యవహారంలో ట్రంప్‌తోపాటు పలు ఆరోపణలపై ఆయన లాయర్ మైఖేల్ కొహెన్‌ను కూడా అరెస్ట్ చేశారు. సెక్స్ స్కాండల్ కేసులో ఏకంగా ఓ మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కావడం భారీ చర్చకు దారి తీసింది. ట్రంప్ అరెస్ట్‌కు కారణమైన పోర్న్ స్టార్ ఎవరనే విషయంలోకి వెళితే..

స్ట్రామీ డేనియల్స్ ఎవరు?
డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ తర్వాత ప్రపంచ మీడియాలో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన పేరు స్ట్రామీ డేనియల్స్. ఆమె అసలు పేరు సెఫానీ జార్జ్ క్లిఫోర్డ్ అలియాస్ స్టెఫానీ ఏ జార్జ్. స్ట్రామీ డేనియల్స్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. స్ట్రామీ డేనియల్స్ నాలుగు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో తల్లి వద్దే ఈమె పెరిగింది. బ్యాటన్ రోగ్‌లోని స్టాట్లాండ్ విల్లే మ్యాగ్నెట్ హైస్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయింది.

పోర్న్ స్టార్‌గా జీవితం
అమెరికాలో 2001లో జరిగిన మిస్ న్యూడ్ గ్రేట్ ప్లెయిన్స్ కాంటెస్ట్‌లో గుర్తింపు పొందిన తర్వాత రియల్ సెక్స్ అనే సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత పోర్నుకోపియా, డర్ట్, వేకప్ కాల్, వర్జిన్, నాక్‌డ్ అప్, సాటర్ డై నైట్ లైవ్ లాంటి చిత్రాల్లో నటించింది. అమెరికాలోని పోర్నోగ్రాఫిక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్ట్రామీ డేనియల్స్ అతికొద్దికాలంలోనే స్టార్ పోర్న్ యాక్టర్‌గా పాపులారిటిని సంపాదించుకొన్నది.

రిపబ్లిక్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి
ఆ తర్వాత పోర్న్ చిత్రాలను రూపొందించిన డైరెక్టర్‌గా గుర్తింపు పొందింది. అమెరికాలో నగ్నతారగా మంచి గుర్తింపు ఉంది. పోర్న్ ఇండస్ట్రీకి సంబంధించి.. నైట్‌మూవ్స్ హాల్ ఆఫ్ ఫేమ్, ఏవీఎన్ హాల్ ఆఫ్ ఫేమ్ లాంటి అవార్డులను సొంతం చేసుకొన్నది. నటిగా మంచి పాపులారిటిని సంపాదించుకొన్న తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. రిపబ్లికన్ పార్టీ తరుఫున రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నది

గృహ హింస కేసులో పోర్న్ స్టార్ అరెస్ట్
పోర్న్ స్టార్ స్ట్రామీ డేనియల్స్ జీవితం అత్యంత వివాదాస్పదంగానే ఉంది. ఆమె తొలుత పాట్ మైనేను వివాహం చేసుకొన్నది. ఆ తర్వాత అతడిని వదిలేసి.. మైఖేల్ మాస్నీను వివాహం చేసుకొని 2007 నుంచి 2009 వరకు కాపురం చేసింది. భర్త మాస్నీ గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయడంతో స్ట్రామీ డేనియల్స్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మాస్నీకి విడాకులు ఇచ్చి బ్రెండర్ మిల్లర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత మిల్లర్‌ను వదిలేసి బారెట్ బ్లేడ్‌ను వివాహం చేసుకొన్నది.

డొనాల్డ్ ట్రంప్‌తో శృంగార జీవితం
అయితే వివాదాస్పదాలతో జీవితాన్ని కొనసాగిస్తున్న స్ట్రామీ డేనియల్స్.. 2006లో చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్‌లో డొనాల్డ్ ట్రంప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వారిద్దరి మధ్య శృంగార జీవితానికి దారి తీసింది. కాలిఫోర్నియాకు సమీపంలోని ఓ రిసార్టులో ట్రంప్, స్ట్రామీ డేనియల్స్ శృంగారంలో పాల్గొన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ట్రంప్, ఆయన వర్గం ఖండించింది.

ట్రంప్‌పై వివాదాస్పద ఆరోపణలు
అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఓ మీడియా సమావేశంలో ట్రంప్‌తో శృంగార జీవితాన్ని అనుభవించాను అని స్ట్రామీ డేనియల్స్ ఆరోపణలు చేసింది. దాంతో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. తనపై ఆరోపణలు చేసిన స్ట్రామీ డేనియల్స్ నోరు మూయించేందుకు ట్రంప్ 130000 డాలర్లను ఇచ్చేందుకు తన లాయర్ కోహెన్‌తో రాయబారం జరిపిన వ్యవహారం బెడిసి కొట్టింది.

పన్ను ఎగవేత కేసులో ట్రంప్ అరెస్ట్
స్ట్రామీ డేనియల్స్ నోరు మూయించే ఆ వ్యవహారంపైనే ట్రంప్‌ను అరెస్ట్ చేశారు. అయితే సెక్స్ చేసినందుకు డబ్బు ఇవ్వడం చట్ట వ్యతిరేకం కాదు. కానీ ఆ డబ్బుల వ్వవహారంలో ట్రంప్ ఆర్థిక నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించాడు. పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే కోణంలో ట్రంప్, ఆయన లాయర్‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. స్ట్రామీ డేనియల్స్‌ను బెదిరింపులకు పాల్పడి.. లంచం ఇచ్చి నిజాలను బయటకు రాకుండా చేశారనే అభియోగాలు ట్రంప్‌పై ఆరోపించబడ్డాయి.


Click it and Unblock the Notifications











