CCL 2025 :సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌‌లో రిచ్చెస్ట్ కెప్టెన్ ఎవరంటే.. కళ్లు చెదిరే సంపద, ఎన్ని వేలకోట్లో తెలుసా?

దేశాన్ని క్రికెట్ ఫీవర్‌తో ఊపేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)ను ప్రేరణగా తీసుకుని భారత్‌లో సినీతారల కోసం సెలబ్రెటీ క్రికెట్ లీగ్‌ను తీసుకొచ్చారు. 2011లో ప్రారంభమైన ఈ లీగ్ .. తారలను క్రికెటర్లుగా మార్చింది. నటన, డ్యాన్స్‌లు, ఫైట్సే కాదు తాము క్రికెట్ కూడా బాగా ఆడగలమని స్టార్స్ అంతా ప్రూవ్ చేశారు. రెగ్యులర్ క్రికెట్ మ్యాచ్‌ల మాదిరిగానే ఈ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.

తాజాగా సినీ, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) ఈ ఏడాది కూడా అలరించేందుకు సిద్ధమైంది. ఈ లీగ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని భాషల సినీ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టారు. ఈసారి తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్‌పురి దబాంగ్స్ బరిలో నిలిచాయి.

who is the richest captain in celebrity cricket league 2025

బెంగాల్ టైగర్ జట్టుకు కెప్టెన్‌గా నటుడు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు కిచ్చ సుదీప్ కెప్టెన్‌గా, చెన్నై రైనోస్ జట్టుకు హీరో ఆర్య కెప్టెన్‌గా, ముంబై హీరోస్ జట్టుకు సాకిబ్ సలీం, తెలుగు వారియర్స్ జట్టుకు అఖిల్ అక్కినేని, పంజాబ్ ది షేర్ జట్టుకు సోను సూద్ కెప్టెన్‌గా, భోజ్‌పురి దబాంగ్స్ జట్టుకు ఎంపీ, నటుడు మనోజ్ తివారీ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 8న తొలి మ్యాచ్ జరగనుండగా.. మార్చి 1న సెమీ ఫైనల్, మార్చి 2న ఫైనల్ జరగనున్నాయి.

తెలుగు వారియర్స్‌ జట్టులో సచిన్ జోషి, అశ్విన్ బాబు, సాయిధరమ్ తేజ్, ఆదర్శ్, నందకిషోర్, నిఖిల్, రఘు, సామ్రాట్, తమన్, విశ్వ, ప్రిన్స్, సుశాంత్, ఖయ్యూం, హరీష్ ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు గెలిచామని , ఐదోసారి కూడా కప్పు కొడతామని అఖిల్ సవాల్ విసిరారు. ఇదిలాఉండగా.. సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌కు సారథ్యం వహిస్తున్న వారి గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆన్‌లైన్‌ను జల్లెడ పట్టేస్తున్నారు.

who is the richest captain in celebrity cricket league 2025

ముఖ్యంగా ఆయా కెప్టెన్‌లలో రిచ్చెస్ట్ ఎవరు? ఎవరి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని .. సీసీఎల్ 2025 కెప్టెన్లందరీలోకి సంపన్నుడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సినిమాలు , బ్రాండ్ అండార్స్‌మెంట్స్, ఇతర వెంచర్‌లు, వ్యాపారాల ద్వారా అఖిల్ అక్కినేని ఆస్తుల విలువ దాదాపు రూ.50 కోట్లపైనే సంపద కూడబెట్టినట్లు ఫిలింనగర్ టాక్.

టీఏజీ ఫిట్‌నెస్ అండ్ ట్రైనింగ్ ఎల్ఎల్‌పీ, బ్లాక్ స్టూడ్ అప్పారెల్స్ ఎల్ఎల్‌పీ అనే కంపెనీలలో అఖిల్ భాగస్వామిగా ఉన్నారు. ఇదికాక యూకే కంపెనీ ఫిట్‌ఫ్లాప్‌కు ప్రచారకర్తగా అఖిల్ అక్కినేని వ్యవహరిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. ఇది కాక తన తండ్రి అక్కినేని నాగార్జునకు చెందిన ఆస్తులు , కంపెనీలు కూడా వారసత్వంగా అఖిల్‌కు దక్కనున్నాయి. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలా సీసీఎల్ 2025 కెప్టెన్‌లలోనే అత్యంత ధనవంతుడిగా అఖిల్ అక్కినేని నిలిచారు. సో అదన్న మాట మేటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X