సంక్రాంతి సినిమాల్లో విజేత ఎవరు? చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్‌లో హిట్ కొట్టిందేవరు?
తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి వచ్చిందంటే.. సినిమాల రిలీజ్ మధ్య పోటీ మాత్రమే కాకుండా హీరోల అభిమానుల మధ్య విపరీతమైన పోటీ కనిపిస్తుంది. సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్స్ ట్రోల్సింగ్ మెటీరియల్, అలాగే ఇతర హీరోల మీద కామెంట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎప్పటిలానే ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు, అగ్ర నటులు, యువ హీరోల మూవీస్ మేళవింపుతో సందడిగా మారింది. 2026 సంవత్సరంలో విడుదలైన ఐదు సినిమాల్లో ఏ మూవీ భారీ విజయం సాధించిందనే వివరాల్లోకి వెళితే..
సంక్రాంతి 2026 రేసులో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్. ఈ ఏడాది పండుగ బరిలో నిలిచిన చిత్రాల అన్నింటిలో భారీ బడ్జెట్‌తో రూపొందింది. దాదాపు 3 ఏళ్లుగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్రానికి సుమారుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. అయితే జనవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా తొలి ఆట తర్వాత ప్రేక్షకులు, రెబల్ అభిమానులు, క్రిటిక్ పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా బాక్పాఫీస్ జర్నీపై పూర్తిగా ప్రతికూల ప్రభావం పడింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక సంక్రాంతి పండుగ సీజన్‌లో వచ్చిన రెండో చిత్రం చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమాకు హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను చిరంజీవి తనయురాలు సుస్మిత, యువ నిర్మాత సాహు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం తొలి ఆట తర్వాత అనూహ్యమైన విధంగా పూర్తిగా పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
పండుగ ప్రేక్షకులను ఆలరించడానికి వచ్చిన మూడో చిత్రం రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ జంటగా నటించారు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మించారు. అయితే ఈ సినిమా రొటీన్, రెగ్యులర్ కథతో మూస చిత్రాలను కోవలో ఉండటం సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది అనే విషయం స్పష్టమైంది.
ఇక సంక్రాంతి బరిలో మొదటి నుంచి అంచనాలు పెంచుకొన్న చిత్రం అనగనగా ఒక రాజు. ఈ సినిమా అసలు పూర్తవుతుందా? అనే స్టేజ్ నుంచి పండుగకు కావాల్సిన సరుకుతో కూడిన మూవీ అనే టాక్ రిలీజ్‌కు ముందు సొంతం చేసుకొన్నది. హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరీ చేసిన ప్రమోషన్స్‌కు మంచి రెస్సాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.
అయితే సంక్రాంతి పండుగ సీజన్‌లో అనవసరంగా మూవీని రిలీజ్ చేస్తున్నారనే టాక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం నారి నారి నడుమ మురారి. వరుస ఫ్లాపులతో ఉన్న శర్వానంద్ తాడో పేడో తెల్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజైంది. ఈ చిత్రానికి సామజవరగమన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం కంటెంట్ పరంగా హిట్ టాక్ సొంతం చేసుకొన్నది. అయితే పాజిటివ్ టాక్‌ను కలెక్షన్లుగా మార్చుకోవాల్సిన సవాల్ ఈ సినిమా ముందు ఉంది.
అయితే సంక్రాంతి బరిలో నిలిచిన 5 సినిమాల్లో విజేత ఎవరంటే.. ఎలాంటి సందేహం లేకుండా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా గురించే చెప్పుకోవాలి. ఈ సినిమా కంటెంట్ పరంగా ప్రేక్షకులను మెప్పించి, కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద ముందంజలో ఉంది. అయితే ఆ తర్వాత నారి నారి నడుమ మురారి చిత్రం కంటెంట్ పరంగా పాసైంది. కలెక్షన్ల పరంగా వీక్‌గా కనిపిస్తుంది. ఇక నవీన్ పొలిశెట్టి నటించిన అనగనగా ఒకరాజు కంటెంట్ పరంగా వీక్‌గా ఉంది. కలెక్షన్లపరంగా జోరును కొనసాగిస్తున్నది. ది రాజాసాబ్, భర్త మహాశయులు సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్నట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











