Who is Zara Patel? జారా పటేల్ ఎవరు? రష్మిక మందన్న వైరల్ వీడియోతో సంబంధమేమిటంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్‌తో అభ్యంతరకరంగా (Deep Fake) వీడియోను మార్ఫింగ్ సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేసిన తీరు వివాదంగా మారింది. ఈ వ్యవహారంపై అమితాబ్ నుంచి తెలుగులో నాగచైతన్య నుంచి అందరూ ఖండించారు. అయితే రష్మిక మందన్న వీడియోగా మార్పింగ్ చేసిన ఒరిజినల్ వీడియోలో ఉన్నది ఎవరు? ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ విషయానికి వస్తే..

ప్రస్తుతం రష్మిక మందన్నగా భావించే అసలు వీడియో జరా పటేల్‌ది. ఆమె ఒక లిఫ్టులో దిగిన వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక మందన్న తలను అతికించారు. మార్పింగ్ అనంతరం దానిని మీడియాలో వదిలారు. అయితే కొందరు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఏదో తేడాగి ఉంది అని గుర్తించారు. అనంతరం రష్మికది ఫేక్ వీడియో అని స్పష్టీకరించారు. ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి నేషనల్ క్రష్‌కు మద్దతు లభించింది.

 Who is Zara Patel? How Rashmika Mandanna related to DeepFake Video created by Artificial Intelligence

ఇక జారా పటేల్ విషయానికి వస్తే.. భారత సంతతికి చెందిన బ్రిటన్ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. ఇన్స్‌టాగ్రామ్‌లో ఆమెను 4.5 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె అడల్డ్ కంటెంట్ క్రియేట్ చేయడంలో పాపులర్. ఆమె వీడియోలకు సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అడల్డ్ కంటెంట్ క్రియేషన్ పక్కన పెడితే.. ఆమె వృత్తి డాటా ఇంజనీర్‌గా, మెంటల్ హెల్త్ నిపుణురాలిగా పనిచేస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను జారా పటేల్ అక్టోబర్ 9వ తేదీన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. నల్లటి బికినీ లాంటి డ్రస్‌ను ధరించిన వీడియోను.. నా ముఖం మీదే ఎలివేటర్ డోర్ మూసేశారు అంటూ కామెంట్ పెట్టింది. ఈ వీడియోకు 6 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోను ఆధారంగా చేసుకొని మార్ఫింగ్ చేసి రష్మిక తలను అతికించడంతో జారా పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతున్నది.

 Who is Zara Patel? How Rashmika Mandanna related to DeepFake Video created by Artificial Intelligence

జారా మార్ఫింగ్ వీడియోపై రష్మిక మందన్న స్పందిస్తూ.. ఈ వీడియోను షేర్ చేయడానికి, దాని గురించి మాట్లాడటానికి చాలా ఇబ్బందిగా ఉంది. డీప్ ఫేక్ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. ఇది నాకే కాదు.. ప్రతీ మహిళ ఆందోళన చెందాల్సిన విషయంగా మారింది. టెక్నాలజీని ఇలా దుర్వునియోగం చేయడం దారుణంగా అనిపిస్తుంది అని రష్మిక సోషల్ మీడియాలో స్పందించారు.

 Who is Zara Patel? How Rashmika Mandanna related to DeepFake Video created by Artificial Intelligence

రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిన ఆమె ప్రస్తుతం యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి హాట్ హాట్‌గా నటించింది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X