ముఖ్యమంత్రిగా విజయ్.. మరి కోలీవుడ్‌‌కి నెక్ట్స్ దళపతి ఎవరు? రేసులో ఆ స్టార్ హీరో?

దాదాపు మూడు దశాబ్ధాలుగా కోలీవుడ్‌లో తిరుగులేని నటుడిగా వెలుగొందారు విజయ్. ఫ్యామిలీ, రొమాంటిక్, యాక్షన్, మాస్, లవ్ స్టోరీస్‌తో సినిమాలు చేస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుని దళపతిగా తమిళ చిత్ర పరిశ్రమను శాసించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్. తన సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు తమిళ చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అయితే తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన తమిళ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించారు.

తొలి ఎన్నికలోనే తిరుగులేని మెజారిటీతో ద్రవిడ రాజకీయ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకేలను మట్టికరిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తద్వారా తొలి ఎన్నికలోనే సీఎంగా ఎన్నికైన సినీనటుడిగా ఎన్టీఆర్ సరసన చేరారు. అలాగే సినీ నటుడి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన విజయ్ చేరారు. ఇప్పటి వరకు వెండితెరపై వెలుగొందిన ఆయన.. ఇప్పుడు జన నాయగన్‌గా సుపరిపాలనను అందించేందుకు అడుగులు వేస్తున్నారు.

Who Will Replace Vijay as Kollywood s Next Thalapathy After take charge as Tamil Nadu CM

అంతా బాగానే ఉంది కానీ ఇప్పటి వరకు దళపతిగా కోలీవుడ్‌ను శాసించిన విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. జన నాయగన్ తన చివరి సినిమా అని ప్రకటించారు. దీంతో ఆయన భవిష్యత్తులో సినిమాలలో నటిస్తారా? లేదా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. విజయ్ సీఎం కావడంతో దళపతి సింహసనం ఖాళీ అయ్యింది. మరి విజయ్ ఖాళీ చేసి వెళ్లిన ఆ స్థానాన్ని భర్తీ చేసేదెవరు? విజయ్‌ మాదిరిగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టి కోలీవుడ్‌ను సినిమాను నిలబెట్టేది ఎవరు? అంటూ చర్చ నడుస్తోంది.

కోలీవుడ్‌కు తదుపరి దళపతిగా ఎవరు అన్న దానిపై అజిత్, సూర్య, ధనుష్, విక్రమ్, శివకార్తీకేయన్ లాంటి నటుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో విజయ్ తర్వాత అంతటి క్రేజ్, మాస్ ఇమేజ్ ఉన్న హీరో .. తలా అజిత్ కుమార్. ఖచ్చితంగా తదుపరి దళపతి కాదగ్గ అన్ని అర్హతలు ఆయనలో ఉన్నాయి. అయితే అజిత్ ప్రస్తుతం సినిమాలను చాలావరకు తగ్గించి.. తనకు ఎంతో ఇష్టమైన రేసింగ్‌లో బిజీగా ఉన్నారు. రేసింగ్ పక్కనపెట్టి సినిమాలు చేస్తే మాత్రం అజిత్‌ నెక్ట్స్ దళపతి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ తర్వాత వినిపిస్తున్న పేరు సూర్య.. మాస్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సూర్య ఇటీవలి కాలంలో రేసులో వెనుకబడ్డారు. ఆయన హిట్ కొట్టి చాలాకాలం అవుతోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కంగువా, రెట్రో చిత్రాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ప్రస్తుతం కరుప్పు సినిమాపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు. ఇక విక్రమ్ విషయానికి వస్తే.. ఆయన కూడా హిట్ కొట్టి చాలాకాలం అవుతోంది. అయితే అజిత్, విజయ్ రేంజ్‌లో విక్రమ్ భారీ ఓపెనింగ్స్ రాబట్టడం కష్టమే.

ధనుష్, శివకార్తీకేయన్‌ వంటి యంగ్ హీరోలు కూడా దళపతి రేసులో ఉన్నారు. అయితే వీరిద్దరూ ఫ్యామిలీ, లవ్, రొమాంటిక్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా ధనుష్ ప్రయోగాత్మక సినిమాలతో బిజీగా ఉన్నారు. అమరన్ దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడంతో తదుపరి దళపతి శివకార్తీకేయన్ అని కోలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే అన్న అన్నే.. తమ్ముడు తమ్ముడే. కోలీవుడ్‌కు ఎప్పటికీ దళపతి.. అన్న విజయ్ మాత్రమేనని ఈ వార్తలకు చెక్ పెట్టారు శివకార్తీకేయన్. కానీ వయసు, క్రేజ్‌పరంగా చూస్తే భవిష్యత్తులో కోలీవుడ్‌కు దళపతి అయ్యే అవకాశాలు వీరిద్దరికీ పుష్కలంగా ఉన్నాయి.

Read more about: vijay kollywood thalapathy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X