పవన్ కల్యాణ్ గెలుపుపై కాకుండా షాకింగ్‌గా బెట్టింగ్.. పిఠాపురం విజయంపై జోరుగా పందాలు!
ఆంధ్రప్రదేశ్‌లో రసవత్తరంగా ఎన్నికలు ముగిసాయి. ఎవరికి వారే తమ విజయాలపై మేకపోతు గాంబీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ఆంధ్రాలో అందరి నోట వినిపిస్తున్న ఒకే మాట పిఠాపురం. ఇప్పటి వరకు కొందరికి పరిచయమున్న ఈ నియోజకవర్గం.. పవన్ కల్యాణ్ పోటీలో నిలిచిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిపడింది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై టీడీపీ, జనసేన కూటమి, వైసీపీ కూటమి విశ్వాసంగా ధీమాను కనబరుస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపుపై బెట్టింగ్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీ ఆవిర్బావం తర్వాత ఐదేళ్లకు అంటే 2019లో పవన్ కల్యాణ్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఆయన గాజువాక, భీమవరం రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే అతి విశ్వాసంతో చూసుకోకపోవడంతో రెండు చోట్ల భారీగా ఓటమిపాలయ్యాడు. దాంతో ఎవరూ భరించలేని అవమానాన్ని చవిచూశాడు.
50 ఏళ్ల వయసులో తల్లైన గబ్బర్ సింగ్ భామ.. భర్తకు విడాకులిచ్చి.. ప్రియుడితో రెండో బిడ్డ!

అధికార ఏపీ ప్రభుత్వం నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ ఈ సారి అధ్యాత్మిక పట్టణం పిఠాపురం నుంచి బరిలోకి దిగారు. అప్పటి వరకు పిఠాపురం ఏపీలోని నియోజకవర్గాల్లో ఒకటిగానే ఉండేది. కానీ జనసేనాని బరిలోకి దిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎనలేని గుర్తింపు, ప్రచారం లభించింది. అక్కడి ప్రజలకు గౌరవాన్ని తెచ్చిపెట్టడంతో పవన్ కల్యాణ్‌ను గుండెల్లో పెట్టుకొని ఎలాగైనా గెలిపించాలని కంకణం కట్టుకొన్నారు.
అయితే పవన్ కల్యాణ్‌ను అత్యంత రాజకీయ ప్రత్యర్థిగా భావించిన వైఎస్ జగన్ తన రాజకీయ వ్యూహాలను, ఎత్తులు పైఎత్తులు వేశాడు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వంగ గీతను గెలిపించే ప్రయత్నం చేశారు. అలాగే పిఠాపరంలో వంగా గీతను విజయ గీతను దాటిస్తే.. డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు.
అయితే సుమారుగా పిఠాపురంలో 2.3 లక్షల ఓట్లు ఉండగా.. దాదాపు 2.08 లక్షల ఓట్లు పోలయ్యాయని వార్తలు వినిపించాయి. అయితే పోలైన ఓట్లలో దాదాపు 70 శాతం పవన్ కల్యాణ్‌కు పడ్డాయనే తన అభిమానులు, కార్యకర్తలు చెప్పుకొంటున్నారు. కానీ వైసీపీ మాత్రం కనీసం 5 వేల మెజారిటీతో వంగ గీత గెలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ విజయంపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. అయితే ఆయన గెలుపుపై కాకుండా కేవలంపై అతడు సాధించే మెజారిటీ ఎంత అనే అంశంపై జోరుగా పందాలు వేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎంత మెజారిటీ సాధిస్తారనే విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











