Oscar Awards 2024: ఆస్కార్ అవార్డు వేడుకల్లో వీరి మధ్యే గట్టి పోటీ.. ఏది గెలిచే అవకాశం ఉందంటే?

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో విశిష్ఠంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ అవార్డుల ఈవెంట్ జరగనుంది. ప్రతిష్ఠాత్మక 96వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరగనుంది. జిమ్మి కిమేల్ అకాడమీ వేడుకకు నాలుగోసారి హోస్ట్ చేయనున్నారు.

ఎవరిని ఆస్కార్ వరించనుంది, ఏకంగా 13 విభాగాల్లో నామినేట్ అయిన ఓపెన్ హైమర్ సినిమాకు ఎన్ని ఆస్కార్ అవార్డులు రానున్నాయి, 2023లో అతిపెద్ద హిట్ గా నిలిచిన బార్బీకి ఎన్ని ఆస్కార్ అవార్డులు వస్తాయి అని సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ అన్ని సినిమాలకు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు.

Who s Most Likely to Win The Oscars ar The 96th 96th Academy Awards Check Details

అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పట్ల మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకున్నాడు క్రిస్టోఫర్ నోలన్. ఇప్పుడు ఆస్కార్ బరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయనడంలో సందేహం లేదు. మరి ఆ అంచనాలను అందుకుంటూ ఓపెన్ హైమర్ ఆస్కార్ ను ముద్దాడుతుందా లేదా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

గ్రెటా గెర్విగ్ దర్శకత్వంలో తెరకెక్కి 2023 ఏడాదిలో అతిపెద్ద హిట్ గా నిలిచిన మూవీ బార్బీ. ఓపెన్ హైమర్ తర్వాత 8 విభాగాల్లో నామినేషన్లు సాధించింది. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండనుంది. బెస్ట్ పిక్చర్ విభాగంలో ఓపెన్ హైమర్ సినిమాకే అత్యధిక అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పూర్ థింగ్స్ కూడా బెస్ట్ పిక్చర్ కేటగిరీలో ఆస్కార్ ను అందుకోదగ్గ సినిమా అనడంలో సందేహం లేదు. అయితే ఈ రెండు సినిమాలకు ది ఐట్ మౌంటైన్స్ నుండి గట్టి పోటీ తప్పేలా లేదు.

Who s Most Likely to Win The Oscars ar The 96th 96th Academy Awards Check Details

బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో క్రిస్టోఫర్ నోలన్ ముందు వరుసలో ఉన్నారు. అయితే ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను తెరకెక్కించిన జొనాథన్ గ్లేజర్, రెడ్ ఐలాండ్ మూవీ డైరెక్టర్ రాబిన్ క్యాంపిలో కూడా గట్టి పోటీ ఇవ్వనున్నారు.

ఓపెన్ హైమర్ సినిమాలో లీడ్ రోల్‌లో నటించిన సారీ జీవించేసిన సిలియన్ మర్ఫీ ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ అందుకుంటారన్న అంచనాలు ఉన్నాయి. అయితే ది హోల్డోవర్స్ మూవీలో చేసిన పాల్ గియామట్టి, నెపోలియన్ మూవీలో నటించిన జాక్విన్ ఫీనిక్స్ కూడా పోటీలో ఉన్నారని మరిచిపోకూడదు. ఉత్తమ నటి కేటగిరీ నుంచి ఎమ్మా స్టోన్, సిడ్నీ స్వీనీ మధ్య గట్టి పోటీ నెలకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X