చిన్న వయసులో అలా తల్లినయ్యాను.. అతడే కారణం.. సీక్రెట్ చెప్పిన యాక్టర్ ప్రగతి
తెలుగు సినిమా పరిశ్రమలో అందంతో ఆకట్టుకొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులో ప్రగతి అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. గత దశాబ్దకాలానికిపైగా ఆమె వివిధ రకాలుగా క్యారెక్టర్లు చేస్తూ దక్షిణాదిలో తనదైన శైలిలో రాణిస్తున్నారు. అయితే యాక్టింగ్ పరంగా కాకుండా పలు రకాల విషయాలతో మీడియాలో ఆమె పేరు విస్తృతంగా ప్రచారంలో ఉంటుంది. ఆమె తన కెరీర్ గురించి మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే హీరోయిన్ అవకాశాలు ఎందుకు వదులుకొన్నాననే విషయంపై క్లారిటీ ఇస్తూ..
అమ్మ, అక్క, వదిన లాంటి పాత్రల్లో మెప్పిస్తూ నటిగా తన జీవితాన్ని తాను లీడ్ చేసే ప్రగతి కరోనా సమయంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన ఇమేజ్‌కు భిన్నంగా వర్కవుట్లు, వెయిట్ లిఫ్టింగులు చేస్తూ అందర్నీ ఆకట్టుకొన్నది. ఆమె చేసే ఎక్సర్‌సైజ్‌లు, వర్కవుట్ విన్యాసాలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలపై ప్రగతి ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న వార్తలను ఖండించారు. తన జీవితం గురించి ఇష్టవచ్చిన మాట్లాడకూడదు. నా లైఫ్ గురించి గాసిప్స్ ప్రచారం చేయకూడదు. ఒకవేళ హద్దు మీరితే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని చెప్పారు.
అయితే ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 7 వేదికపై మెరిసిన ఈ అందాల క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రగతి గురించి నాగార్జున అక్కినేని మాట్లాడుతూ.. వెయిట్ లిప్టింగ్‌లో స్టేట్ ఛాంపియన్ షిప్ సాధించింది. ఇక జాతీయ స్థాయిలో ఛాంపియన్‌షిప్ సాధించేందుకు ప్రగతి రెడీ అవుతున్నది. ఆమె సాధారణమైన ఉమెన్ కాదు అని పొగడ్తలతో ముంచెత్తాడు.

యాక్టర్ ప్రగతీ కెరీర్ విషయానికి వస్తే.. తొలుత హీరోయిన్ అవుతామని ఇండస్ట్రీలో అడుగపెట్టింది. అయితే కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. అయితే హీరోయిన్ కావాలనే ఆశలను పక్కన పెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలతో పరిశ్రమలో స్థిరపడేందుకు సిద్దమయ్యారు.
అయితే తాను హీరోయిన్ పాత్రల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టు కావడానికి కారణం నా శ్రేయోభిలాషి ఒకరు ఇచ్చిన సలహానే. నేను హీరోయిన్ పాత్రల కోసం వేచి చూస్తుంటే నాకు సూచనలు చేశారు. హీరోయిన్ లైఫ్ కొన్నేళ్లే.. క్యారెక్టర్ ఆర్టిస్టు అయితే జీవితం చివరి వరకు నటిగా మిగిలిపోవచ్చు. కాబట్టి నీవు క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపో అని సలహా ఇచ్చారు. అలా నేను చిన్న వయసులోనే తల్లి పాత్రలు పోషించాను. అలా నేను తల్లి, వదిన, అక్క లాంటి పాత్రలు ఎంచుకోవడానికి అతడే కారణం అని ప్రగతి చెప్పారు.


Click it and Unblock the Notifications











