పవన్ కల్యాణ్‌కు అయిష్టంగా.. అల్లు అర్జున్ సీక్రెట్‌ మీటింగ్.. అసలు కథే ఏమిటంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుటుంబంలో విషాదం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే భారీ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరిపిల్చుకొన్నారు. అయితే గతవారం సమ్మర్ క్యాంప్ కోసం సింగపూర్ వెళ్లిన పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోచ్ ఓ స్కూల్‌లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో గాయపడటం తెలిసిందే. అయితే పవన్‌ కుటుంబంలో జరిగిన ఈ స్వల్ప విషాదం నేపథ్యంలో ప్రధాని మోదీ నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ వ్యక్తిగతంగా, సోషల్ మీడియా ద్వారా పరామర్శించారు.

అయితే అల్లు కుటుంబం నుంచి ఎలాంటి పరామర్శ సోషల్ మీడియాలోను. మీడియాలోను కనిపించకపోవడంతో వారి మధ్య విభేదాలే కారణమని అందరూ భావించారు. అయితే తాజాగా గుట్టు చప్పుడు కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీసమేతంగా పవన్ ఫ్యామిలీని కలిసి పరామర్శించిన ఘటన మీడియాలో రకరకాలుగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Allu Arjun meets Pawan Kalyan secretly

సింగపూర్ ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్‌ను కలిసిన పవన్ దంపతులు.. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌కు తీసుకొచ్చి వైద్య చికిత్స చేయిస్తున్నారు. అయితే అబ్బాయిని కూడా చాలా సీక్రెట్‌గా, మీడియాకు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమనుకొంటే తప్ప విజిటర్స్‌ను అనుమతించడం లేదనేది తెలిసింది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు ప్రకటనగానీ, సోషల్ మీడియాలో ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోవడంతో వారి మధ్య ఇటీవల నెలకొన్న వివాదమే కారణమని అందరూ ఊహాగానాలతో సరిపెట్టుకొన్నారు. కానీ సోమవారం రాత్రి అల్లు అర్జున్ మాత్రం తన సతీసమేతంగా సీక్రెట్ కలిశారనే విషయం మీడియాకు తెలిసింది. అయితే అల్లు అర్జున్ కలిసిన విషయాన్ని ఆయన పీఆర్ వర్గాలు వెల్లడించాయి. కానీ అధికారికంగా ఎక్కడా కూడా ప్రకటన చేయకపోవడం అదోక చర్చకు దారి తీసింది.

Allu Arjun meets Pawan Kalyan secretly

అయితే జనసేన, పవర్ స్టార్ ఫ్యాన్స్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. అల్లు అర్జున్‌ ఫ్యామిలీని కలువడానికి మెగా ఫ్యామిలీ విముఖత చూపించారని. పవన్ కూడా కలిసేందుకు అయిష్టతను చూపించారు. కానీ కొందరు మధ్యవర్తిత్వం వల్ల వారి కలయిక జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించకూడదనే విషయం గురించి రెండు వర్గాలు కూడా జాగ్రత్తలు వహించాయి. అందుకే ఈ సీక్రెట్ మీటింగ్ గురించి అధికారికంగా బయటకు రాకుండా చర్యలు తీసుకొన్నట్టు తెలుస్తున్నది.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్తికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం వద్ద నుంచి మెగా, అల్లు కుటుంబంలో వివాదం నెలకొన్నది. ఈ వివాదం నేపథ్యంలో కొందరు అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్లను మెగా హీరోలు అన్ ఫాలో అవ్వడంతో వివాదం బహిర్గతమైంది. ఇక పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్‌ వివాదంతో అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిన సమయంలో మెగా హీరోలు పెద్దగా స్పందించకపోవడం కూడా తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X