Mega Vs Allu: అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ ఫైర్.. రాంచరణ్ బర్త్ డే రోజున కొత్త వివాదం!

ఒకప్పుడు తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ కుటుంబాల్లో నందమూరి హీరోలు కొందరు నడుమ కోల్డ్ వార్ కోసం ఏ రకంగా చర్చలు జరిగేవో అందరికీ తెలిసిందే. కానీ దానిని బీట్ చేసే విధంగా మెగా కుటుంబం నుంచి ఓ క్లాష్ హైలైట్ అవుతుంది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు. కానీ అది నిజం అయ్యింది.

కాగా గత కొన్నాళ్ల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే మిగతా మెగా హీరోల నడుమ ఎలాంటి గ్యాప్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజానికి ఇది గత కొన్నేళ్ల పాటుగా కూడా కొనసాగుతుంది. కానీ గత ఏడాది 2024 ఎన్నికల ముందు జరిగిన ఘటన మాత్రం మెగా అభిమానులకి అస్సలు నచ్చలేదు.

Allu Arjun not wished Ram Charan

దీనితో ఇక్కడ నుంచి బన్నీ సినిమాలు మెగా అభిమానులు బాయ్ కాట్ చేస్తామని చెప్పడం దీనికి బదులుగా అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో మెగా హీరోస్ పై హద్దులు దాటడం వంటివి చాలానే హంగామానే నడిచింది. కాగా మధ్యలో తన పుష్ప 2 సినిమా హైక్స్ పరంగా పవన్ కళ్యాణ్ కి బాబాయ్ అంటూ అల్లు అర్జున్ మాట్లాడ్డం బాగానే అనిపించింది కానీ చాలా మంది మెగా అభిమానులు మాత్రం ఇప్పటికీ బన్నీకి వ్యతిరేకంగానే ఉన్నారు.

ఎప్పుడైతే అల్లు అర్జున్ కి వరుస హిట్స్ రావడం మొదలయ్యాయో అక్కడ నుంచే తన అసలు రంగు చూపించడం స్టార్ట్ చేసాడని కొందరు అంటుంటారు. అయితే వీటి అన్నిటికీ ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఇపుడు మళ్ళీ అల్లు అర్జున్ విషయంలో మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ మార్చ్ 27న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వచ్చింది. సినీ పరిశ్రమలో దాదాపు అందరు స్టార్స్ తనకి శుభాకాంక్షలు తెలియజేసారు.

కానీ అల్లు అర్జున్ నుంచి మాత్రం నామమాత్రంగా కూడా ఎలాంటి చిన్న పోస్ట్ కూడా రాలేదు. దీనితో మెగా హీరోస్ విషయంలో అల్లు అర్జున్ కావాలనే ఇపుడు దూరంగా ఉంటున్నాడు అనే టాక్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్లో హిట్స్ అందుకోవడంతో లైఫ్ ఇచ్చిన మెగా కుటుంబాన్నే పక్కన పెట్టి మళ్ళీ బుద్ది చూపిస్తున్నాడు అని సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు.

ఇలా మళ్ళీ కొత్త కాంట్రవర్సీలు అభిమానులు వారికి వారే వెతుక్కుంటున్నట్టుగా మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి. మరి ఇవన్నీ ఎప్పటికి సెటిల్ అవుతాయి అనేది మాత్రం పెద్ద ప్రశ్న గానే మారింది. కాగా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ లో అల్లు అర్జున్ బర్త్ డే ఒకటి వస్తుంది. మరి అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి.

కాగా రామ్ చరణ్ విషయంలో ఎన్టీఆర్ విష్ చేసినప్పటికీ జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి ఇతర స్టార్స్ కూడా ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో విష్ చేసింది లేదు. మరి ఇవన్నీ మెగా అభిమానులు తమ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కాదు కాబట్టి వదిలేసారు కానీ అల్లు అర్జున్ మాత్రం చెప్పలేదని ఇక్కడ లాజిక్ చెబుతున్నారు.

More from Filmibeat

Read more about: allu arjun ram charan mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X