Who is Jitender Reddy? జితేందర్ రెడ్డి మూవీని బ్యాన్ చేయాలా? అందులో వివాదం ఏముంది?

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో సంచలనం రేపిన ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం విడుదలకు సిద్దమైంది. జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహించిన నేత లైఫ్‌లోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని జితేందర్ రెడ్డి పేరుతోనే సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో గురించిన వివరాలు, అలాగే జితేందర్ రెడ్డి జీవితం గురించిన వివరాల్లోకి వెళితే..

తెలంగాణ ప్రాంతంలో వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో ఏబీవీవీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో కీలక పాత్ర పోషించిన జితేందర్ రెడ్డి తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్దిస్తుందనే నినాదాన్ని ఎదురించాడు. జగిత్యాల ప్రాంతానికి చెందిన జితెందర్ రెడ్డి తాను నమ్మిన సిద్దాంతం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్దమయ్యాడు. వామ పక్ష ఉద్యమ నాయకులతో నువ్వానేనా అనే పోరాటం చేశాడు. చిన్నతనం నుంచి తనలోని దేశభక్తి చాటుతూ తన సిద్దాంతాల కోసం పోరాడి ప్రాణ త్యాగం చేశారు.

Why Ban on Jitender Reddy Movie What is controversial in the content says Rakesh Varre

జితేందర్ రెడ్డి జీవితం రైట్ వింగ్ వాదులకు స్పూర్తిని నింపింంది. ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఆయన చేసిన పోరాటం, ఆయనలోని దేశభక్తి గురించి గొప్పగా చెబుతుంటారు. అలాంటి కథను ఎంచుకొని ముదుగంటి రవీందర్ రెడ్డి, ఉమ రవీందర్ నిర్మించిన చిత్రం నవంబర్ 9వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది.

జితేందర్ రెడ్డి సినిమా ఈవెంట్‌లో బాహుబలి ఫేమ్ రాకేశ్ వర్రే మాట్లాడుతూ.. ఎవరికీ చెప్పొద్దూ సినిమా తర్వాత, మంచి కంటెంట్ ఉన్న సినిమా చేయాలి. మాములు కంటెంట్‌తో సినిమా చేయకూడదని నిర్ణయించుకున్ను. ఆలస్యమైనా ఫర్వాలేదని కంటెంట్ ఉన్న స్టోరీ కోసం వెతికాను. మార్కెట్ లేకపోతే ఏ హీరో ని పట్టించుకోరు. రాకేష్ అనే నేను ఒక బ్రాండ్ గా ఎదిగిన రోజున నేను కొత్త వాళ్ళతో సినిమా చేస్తాను. జితేందర్ రెడ్డి సినిమా నేను చేయడానికి కారణం ఈ సినిమా కథ అనే అని రాకేశ్ వర్రే అన్నారు.

Why Ban on Jitender Reddy Movie What is controversial in the content says Rakesh Varre

కంటెంట్ ప్రకారం రిచ్‌గా తెరకెక్కించడానికి నిర్మాత రవీందర్ రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. వాస్తవానికి మే నెలలో రిలీజ్ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్ వస్తున్నది. కనీసం సినిమా చూసి అందులో ఏం ఉందొ మాట్లాడండి. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి. జితేందర్ రెడ్డి ఓ ఫైటర్. అయన అభిమానులు ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమాను 75 రూపాయలకే ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాంఅని రాకేశ్ వర్మే అన్నారు.

స్పూర్తిదాయకమైన జితేందర్ రెడ్డి గారి కథ విన్నాక, ఈ సినిమా చేయాలనే డిసైడ్ అయ్యా. ఆయన సోదరుడే సినిమా నిర్మించాలనే పట్టుదలతో కనిపించాడు. ఈ చిత్రానికి భారీ స్కోప్ ఉంది. ఈ సినిమాకి సరైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత దొరకడం నా అదృష్టం. ఎప్పుడూ కూడా రాజీ పడకుండా సినిమా చేసారు. రాకేష్ నటించడమే కాకుండా నిర్మాణంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని దర్శకుడు విరించి వర్మ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X