అక్కినేని కుటుంబం అంతా హాజరైన వేడుకకు ఆమె ఎందుకు రాలేదు.. కారణం అదేనా?
తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్నో రకాల సినిమాల్లో నటించి.. పాత్రలకు ప్రాణం పోశారు. అలాంటి నటుడి పేరు మీదు అందిస్తున్న జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో పెద్ద వేడుకలా జగింది. ప్రతి ఏటా ఈ అవార్డుల ఫంక్షన్ ను నిర్వహించాల్సి ఉన్నా.. గడిచిన ఏడాది కార్యక్రమాన్ని నిర్వహించలేదు. దీంతో.. రెండేళ్లకు సంబంధించిన పురస్కారాల్ని నిన్నటి కార్యక్రమంలో అందజేశారు.
Recommended Video

ముఖ్య అతిథిగా చిరు..
భారీ ఎత్తున సినీ ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. టాలీవుడ్ కు చెందిన పలు విభాగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాగా.. బాలీవుడ్ నుంచి కొందరు హాజరయ్యారు.

కదిలివచ్చిన అక్కినేని కుటుంబం..
ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబానికి చెందిన వారంతా హాజరయ్యారు. సుమంత్, సుశాంత్, నాగ్ సోదరీమణులు, అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలను చూసుకునే సుప్రియ, నాగచైతన్య, అమల ఇలా ప్రతీ ఒక్కరు హాజరయ్యారు. ఎందుకుంటే ఈ కార్యక్రమం అక్కినేని కుటుంబ ప్రతిష్టకు సంబంధించింది. జాతీయ స్థాయి అవార్డు కార్యక్రమం కాబట్టి.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ఎంతో బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.

కానరాని అక్కినేని కోడలు..
అంత మంది వేడుకకు హాజరైనా.. అందరి కళ్లు ఒకరిపై పడ్డాయి. అదే అక్కినేని కోడలు సమంత. ఇంటి ఫంక్షన్ లో సామ్ ఎందుకు లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల వారు పాల్గొన్న కార్యక్రమంలో సామ్ గైర్హాజరుకు కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.

పూర్తైన 96 షూటింగ్
సమంత నటిస్తున్న 96 షూటింగ్ పూర్తి అయిపోయింది. మరి.. అలాంటప్పుడు ఆమెకు ఎలాంటి కమిట్ మెంట్స్ లేవుగా? అన్న ప్రశ్నను కొందరు వేస్తుంటే.. అక్కినేని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న వారు మాత్రం.. సమంత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వారి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నందున బిజీగా ఉండి రాలేకపోయి ఉండొచ్చని టాక్.

న్యూయార్క్ నుంచి వచ్చిన బోనీకపూర్..
అవార్డుల ఫంక్షన్ కు ఒకట్రెండు రోజుల ముందు దివంగత శ్రీదేవి భర్త బోనీకపూర్ న్యూయార్క్ లో ఉన్నారని.. అలాంటి ఆయన ఈ కార్యక్రమం కోసం హాజరైనప్పుడు ఇంటి ఫంక్షన్ విషయంలో సమంత ఎందుకు రాలేకపోయిందన్నది కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి.. సమంత దీనిపై క్లారిటీ ఇస్తుందా? లేదా నాగచైతన్య బదులిస్తాడా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











