Hit List స్టార్ డైరెక్టర్ కొడుకు హీరో కోసం.. నిర్మాతగా కేఎస్ రవికుమార్.. హీరో సూర్య సపోర్ట్‌తో..!

సినిమా పరిశ్రమలో గ్రాటిట్యూడ్ ఉండదు. సహయం చేసిన వారిని పెద్దగా పట్టించుకోరు అనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ అలాంటి వాటికి అతీతంగా స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ తనకు హెల్ప్ చేసిన వ్యక్తి కుమారుడిని హీరోగా చేసేందుకు నిర్మాతగా మారడం విశేషంగా చెప్పుకొంటున్నారు. తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్ కోసం కేఎస్ రవికుమార్ నిర్మాతగా మారారు.

సూర్య కతిర్ కాకల్లార్, కే కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్కె సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను తమిళ స్టార్ హీరో సూర్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీమోహన్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ రావు, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్, బెక్కం రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకలో ప్రముఖులు వెల్లడించిన విషయాల్లోకి వెళితే...

Why Director KS Ravi Kumar Turned as Producer for Hit List movie

ప్రముఖ దర్శకుడు విక్రమన్ ఎందరికో స్పూర్తిని ఇచ్చే సినిమాలు నిర్మించారు. అలాంటి వ్యక్తికి కొడుకైన విజయ్ కనిష్క తన తండ్రి నుంచి చాలా నేర్చుకొని తొలి సినిమాలోనే అద్బుతంగా నటించాడు. కేఎస్ రవికుమార్ నాకు మంచి ఫ్రెండ్.ఈ సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది అని మురళీ మోహన్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కేఎస్ రవికుమార్ టీం కి నా అభినందనలు. హీరో విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుంది. టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో 10 ఏళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. 1990లో కుదు వసంతం సినిమాతో విక్రమన్ సార్‌తొ మంచి పరిచయం ఏర్పడింది. ఆయనతో ఉన్న అనుబంధంతో విజయ్ కనిష్క‌ను నేను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను తెలుగు, తమిళంలో ఎంతోమంది పెద్ద హీరోలతో పని చేశాను. మే 31న ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. కచ్చితంగా అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో విజయ్ కనిష్క మాట్లాడుతూ..నాకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. మా అమ్మ గారు తెలుగు, నాన్నగారు తమిళ్. సో రెండు నాకు చాలా ఇష్టం. హిట్ లిస్ట్ మూవీ కథ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న శ్రీనివాస్ గౌడ్ గారికి బిక్కం రవీంద్ర గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

నా దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ నాకు చాలా కంఫర్ట్ ఇచ్చి ఈ సినిమా చేయించారు. మా నాన్నగారు తమిళ్, తెలుగులో పెద్ద సినిమాలు తీసిన డైరెక్టర్ విక్రమన్ గారు. తెలుగులో మా నాన్నగారు మొదటగా తీసిన సినిమా వసంతం.హీరో వెంకటేష్ ఆయనకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు కూడా ఈ సినిమాకి అదే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X