ప్రభాస్ ఆ హీరోని తన ఫాంహౌస్‌కి రానివ్వడా? .. నెంబర్ బ్లాక్ చేసి, డార్లింగ్‌తో ఎందుకీ దూరం?
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మనిషిగా , అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్. 20 ఏళ్ల కెరీర్‌లో ఏ వివాదంలో తల దూర్చకుండా తన పని తాను చేసుకుపోతుంటారు ప్రభాస్. ఇతర హీరోల అభిమానులు కూడా ప్రభాస్ గురించి చెడుగా చెప్పడం కానీ, విమర్శలు చేయడం కానీ జరగదు. ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇండస్ట్రీలో అందరితోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఓ హీరో విషయంలో ప్రభాస్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో బిజీగా ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ ఒక్కరే. పాన్ ఇండియా స్టార్‌గా ఆయన పేరు మీద ఇప్పుడు వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, ఫౌజీ సినిమాలు ప్రభాస్ చేస్తున్నారు. ఇవి పూర్తి కాకుండానే ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. మారుతి దర్శకత్వంలో నటిస్తున్న ది రాజా సాబ్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు.. అయితే అనివార్య కారణాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు చిత్ర యూనిట్ మే నెలలో టీజర్‌ను విడుదల చేయాలని భావిస్తోంది. దర్శకుడు మారుతి ఈ విషయంపై ఇప్పటికే అధికారికంగా సంకేతాలిచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాస్ భారత్‌కు తిరిగి రాగానే డబ్బింగ్ పూర్తి చేసి టీజర్‌ను విడుదల చేస్తారని ఫిలింనగర్ టాక్. ది రాజా సాబ్‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తుండగా .. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇక తన ఇంటికి ఎవరొచ్చినా సరే భోజనం పెట్టకుండా పంపరు ప్రభాస్. ఇక తనతో కలిసి పనిచేసే నటీనటులు, సాంకేతిక నిపుణులకు భారీ మొత్తంలో భోజనం, ఇతర వంటకాలు పంపి వారిని సర్‌ప్రైజ్ చేస్తుంటారు డార్లింగ్. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రభాస్ ఇంటి రుచులు తిన్నవారే. తన పెదనాన్న కృష్ణంరాజు పెదకర్మ రోజున లక్ష మందికి పైగా అన్నదానం చేయించి పెద్ద మనసు చాటుకున్నారు. నాన్ వెజ్, వెజ్ వంటకాలతో జరిగిన ఈ భారీ కార్యక్రమం ఏకంగా జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. పలువురు స్టార్స్‌ని ఇంటికి ఆహ్వానించి వారిని వెరైటీ వంటకాలతో థ్రిల్ చేసే ప్రభాస్ ఓ స్టార్ హీరోని మాత్రం పిలవకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా లైవ్‌లోనే ప్రశ్నించారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు ఓ సారి ప్రభాస్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన పెళ్లి , ఎఫైర్స్ ఇతర వివరాలను బాలయ్య బయటికి లాగే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే డార్లింగ్.. నీ ఫాంహౌస్‌కి రానీ హీరో లేడు, కానీ నన్ను మాత్రం పిలవలేదంటూ ప్రశ్నించారు. దీనికి ప్రభాస్ సిగ్గుతో మెలికలు తిరుగుతూ త్రీ మంత్స్‌తో మీకు ఫోన్ రాకపోతే అడగండి అని ఆన్సర్ ఇచ్చారు. దాంతో బాలయ్య ఎవరినీ అడగాలి? అంటూ సీరియస్ అయ్యారు.
నువ్వు ఆ తర్వాత ఫోన్ లో అందుబాటులో ఉండాలి కదయ్యా అంటూ బాలయ్య వ్యాఖ్యానించారు. నా నెంబర్ కనిపించగానే ఫోన్ కట్ చేస్తావ్.. లేకపోతే బ్లాక్ చేస్తావ్ అంటూ మండిపడ్డారు. అలా కాదు సార్ .. ఈసారి తప్పకుండా వద్దురు గానీ , ఇంకో ఫోర్ మంత్స్‌లో తీసుకెళ్తా.. మనం మీ మ్యాన్‌హౌస్‌తో పార్టీ చేసుకుందాం అని ప్రభాస్ అనగా నేను రెడీ అని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











