Dragon Glimpse: లూగర్ అంటే ఏమిటీ? డ్రాగన్‌లో ఎన్టీఆర్ పేరు వెనుక క్రేజీ స్టోరీ!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న మూవీ డ్రాగన్. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్- నీల్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంది. తాజాగా మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని డ్రాగన్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్‌ను గతంలో ఎన్నడూ చూడని విధంగా మాస్ అవతార్‌లో చూపించారు ప్రశాంత్ నీల్. డ్రగ్స్, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందని గ్లింప్స్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ లూగర్ అనే పాత్ర పోషిస్తున్నారు. అయితే లూగర్ అంటే ఏమిటీ? ప్రశాంత్ నీల్ ఆ పేరునే సెలెక్ట్ చేసుకోవడం వెనుక సోషల్ మీడియాలో ఓ కథనం చక్కర్లు కొడుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌లపై డ్రాగన్ మూవీని రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నెనీ, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాంతారా చాప్టర్ 1 ఫేమ్ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజం అనిల్ కపూర్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. 2027 జూన్ 11న డ్రాగన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా సెట్స్ మీదకి వెళ్లినప్పటి నుంచి ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది? డ్రాగన్ కథ ఏంటీ? అనే దానిపై అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల కథనాలు వచ్చాయి. తాజాగా ఈ సస్పెన్స్‌కు తెరదించారు ప్రశాంత్ నీల్.

Why Jr NTR s Character in Dragon is Called Luger Interesting Story Behind Prashanth Neel s Powerful Title

డ్రాగన్ గ్లింప్స్ పేరిట మే 19వ తేదీ అర్ధరాత్రి ఓ చిన్న ట్రైలర్ లాంటిది విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ లుక్, వివిధ పాత్రలు, కథ ఏంటీ? అన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు ప్రశాంత్ నీల్. భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలం నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో నల్లమందు ఇతర మాదక ద్రవ్యాల వ్యాపారం, ఈ బిజినెస్‌లో గ్యాంగ్‌వార్ చుట్టూ డ్రాగన్ సినిమా తిరుగుతుందని తెలిపారు. ఆఫ్గనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ అనే ఏరియాలు.. ఆఫ్గన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య ఆధిపత్య పోరు.. డ్రగ్స్ డీలర్లు, ఇంటర్నేషనల్ కార్టెల్ చుట్టూ కథ తిరుగుతుందని చూపించారు.

అయితే ఇందులో ఎన్టీఆర్ లూగర్ అనే పాత్రలో వైల్డ్‌గా కనిపించనున్నారని ప్రశాంత్ నీల్ గ్లింప్స్‌లో పేర్కొన్నారు. ఆఫ్గన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన అసాసిన్ ఇన్ చీఫ్ (ప్రధాన హంతకుడు)గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. తమ ప్రత్యర్ధి గ్యాంగ్‌కు చెందినవారిని నరికేస్తూ కొండ చివరన నిలబడి ఉన్న ఎన్టీఆర్ లుక్ పూనకాలు తెప్పిస్తోంది. అయితే తన సినిమాల్లోని హీరోలకు పవర్‌ఫుల్ టైటిల్స్ పెట్టడం ప్రశాంత్ నీల్ స్టైల్. కేజీఎఫ్ సిరీస్, సలార్ సినిమాలలో హీరోలకు ఈ పవర్ ఫుల్ టైటిల్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. దానిలో భాగంగానే డ్రాగన్‌లో ఎన్టీఆర్‌కు కూడా లూగర్ అనే పేరుని ఫిక్స్ చేశారు ప్రశాంత్.

ఇక లూగర్ అనే పదానికి అర్ధం ఏంటీ? అన్న దానిపై సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన కథనం చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం లూగర్ అంటే దాదాపు 100 ఏళ్ల నాటి జర్మన్ పిస్టల్ పేరు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో జర్మన్ సైనికులు ఈ పిస్టోల్‌ను ఉపయోగించారు. ఆస్ట్రియాకు చెందిన జార్జ్ లూగర్ అనే మిలటరీ అధికారి ఈ పిస్టోల్‌కు డిజైన్ చేశారు. అత్యంత ఖచ్చితత్వానికి, ప్రాణాంతకమైన వేగానికి, క్రూరత్వానికి ఈ తుపాకీ మారుపేరుగా నిలిచింది. ఈ తుపాకీ స్పూర్తిగా ఎన్టీఆర్‌ పాత్రకు కూడా లూగర్ అనే పేరును పెట్టారు ప్రశాంత్ నీల్. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్.. ఓ లోడ్ చేసిన గన్‌లా, శత్రువులను వేటాడే క్రూరమైన వ్యక్తిగా ఉంటాడట. అందుకే ప్రశాంత్ ఈ పేరును ఎంచుకున్నారు. మరి లూగర్ విన్యాసాలు ఎలా ఉంటాయో తెలియాలంటే వచ్చే ఏడాది సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more about: jr ntr dragon prashanth neel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X