రావు బహదూర్‌ను మహేష్ బాబు ఎందుకు ప్రజెంట్ చేశారంటే.. 6 గంటలపాటు అలా.. సత్యదేవ్ (ఇంటర్వ్యూ)

సూపర్ స్టార్ మహేష్ బాబు సొంత బ్యానర్ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రూపొందుతున్న చిత్రం రావు బహద్దూర్. ఈ సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై చింత గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్, వికాస్ ముప్పాల, మలయాళ నటి దీపా థామస్, బాలా పరసార్, ఆనంద్ భారతీ, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు రచయితగా, దర్శకుడిగా, ఎడిటర్‌గా వెంకటేష్ మహా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దినేష్ యాదవ్ బొల్లెబోయిన, సినిమాటోగ్రాఫర్: కార్తీక్ పర్మార్, మ్యూజిక్: స్మరణ్ సాయి, ప్రొడక్షన్ డిజైనర్: రోషన్ సింగ్, క్యాస్టూమ్ డిజైనర్: శిల్పా జీఎన్ఎస్, సౌండ్ డిజైనర్: అశ్విన్ రాజశేఖర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా జూలై 3వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సత్యదేవ్ ఫిల్మీబీట్‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. మహేష్ బాబు ఈ సినిమాను సమర్పించడంపై సత్యదేవ్ మాట్లాడుతూ..

Mahesh Babu Support to Rao Bahadur

60 ఏళ్ల వృద్ధుడైన రామప్ప జర్నీ ఈ సినిమా కథ. వృద్దాప్యం నుంచి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లి 25 ఏళ్ల యువకుడి లైఫ్ వరకు కథ ఉంటుంది. ఈ చిత్రంలో వృద్దుడి పాత్ర కీలకం. ఈ పాత్ర కోసం మేకప్ చాలా అవసరం. అందుకోసం ముంబై నుంచి ప్రత్యేకంగా మేకప్ టీమ్‌ను రప్పించాం. రామప్ప మానసిక పరిస్థితిని ప్రతిబింబించేలా నా లుక్ ఉంటుంది. నా కెరీర్‌లో అత్యంత ఛాలెంజ్‌తో కూడిన పాత్ర ఇది అని సత్యదేవ్ చెప్పారు. ఈ పాత్రలోను, సినిమాలోను చాలా ఎమోషన్స్ ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు ఉండేలా దర్శకుడు వెంకటేశ్ మహా జాగ్రత్తలు తీసుకొన్నాడు అని తెలిపారు.

సైకాలజికల్ డ్రామాతో కూడిన కథను నమ్రత శిరోద్కర్‌కు దర్శకుడు వెంకటేష్ మహా రెండు గంటలపాటు చెప్పారు. ఈ స్టోరీ నమ్రతకు బాగా నచ్చడంతో ఆ తర్వాత ఆరు గంటలపాటు ఈ కథ గురించి చర్చించారు. అనంతరం ఈ సినిమాను సమర్పించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాను చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ కలిసి నిర్మిస్తున్నారు అని సత్యదేవ్ తెలిపారు.

రావు బహద్దూర్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సపోర్ట్ చేయడం, ప్రజెంట్ చేయడం పెద్ద బలంగా మారింది. జీఎంబీ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే.. అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అంచనాలను మించేలా మేమంత కష్టపడ్డాం. ఈ సినిమాను మహేష్ బాబు ఇటీవల చూశారు. ఆయన ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇస్తారనే ఆతృతగా వేచి చూస్తున్నాం. ఆయన ఇచ్చే ఫీడ్ బ్యాక్‌తో సినిమా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్తుంది అని సత్యదేవ్ చెప్పారు.

టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తన విలక్షణమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన 'రావు బహద్దూర్' చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా సమర్పిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా సత్యదేవ్ పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: mahesh babu namrata Rao Bahadur
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X