Why Watch Kannappa? : కన్నప్ప సినిమా ఎందుకు చూడాలి.. 5 ప్రధాన అంశాలు!

టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం కన్నప్ప. గొప్ప శివభక్తుడు తిన్నన్ జీవిత కథ ఆధారంగా మైథాలజీ సబ్జెక్ట్ తో రూపుదిద్దుకుంది. మంచు ఫ్యామిలీ తొలిసారిగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించడం, పాన్ ఇండియా స్థాయిలో, మరోవైపు ఓవర్సీస్ లోనూ యూకే, నార్త్ అమెరికా వంటి దేశాల్లోనూ భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది. సినిమాకు కాస్తా పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం విశేషం. ఈ క్రమంలో చాలా మందిలో కన్నప్ప చిత్రాన్ని ఎందుకు చూడాలనే సందేహం కలుగుతోంద. కాగా సినీ నిపుణులు ఈ చిత్రానికి చూడటానికి ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

కన్నప్ప చిత్రానికి భారీ స్పందన..
జూన్ 20న ప్రపంచ వ్యాప్తంగా కన్నప్ప చిత్రం విడుదల అవుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కు మంచి స్పందన లభించింది. రిలీజ్ కు ముందు 1.5 లక్షల టికెట్లు అమ్ముడు పోయాయి. రూ.2 కోట్ల వరకు ఇండియాలోనే రిలీజ్ కు మందు ప్రీ రిలీజ్ సేల్ జరిగింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ సేల్ ద్వారా రూ.25వేల డాలర్లు అంటే రూ.30 లక్షలకు పైగా వసూళ్లు అందాయి. ఇలా మొత్తం మిగితా ఏరియాల నుంచి కూడా కలపుకొని రూ.2.5 కోట్ల వరకు ప్రీ సేల్ జరిగిందని నిపుణులు తెలుపుతున్నారు.

Why Manchu Vishnu Kannappa Movie Must Watch

కన్నప్ప సినిమాపై పాజిటివ్ టాక్..
కన్నప్ప చిత్రంపై రిలీజ్ కు కొద్ది నెలల నుంచి భారీ అంచనాలు నెలకున్నాయి. అందుకు కారణం మంచు విష్ణు కథ, స్క్రీన్ ప్లేను అందించడం, హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించడం, భారీ తారగణం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక ఓవర్సీస్ లో ముందుగానే ప్రదర్శితమైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కుతుండటం విశేషం. కొంత నెగెటివ్ టాక్ వినిపిస్తున్న పెద్దగా సినిమా విజయాన్ని ప్రభావితం చేయదని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

5 ప్రధాన అంశాలు..
కన్నప్ప చిత్రం విడుదల సందర్భంగా చాలా మంది నుంచి అస్సలు ఈ చిత్రాన్ని ఎందుకు చూడాలనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని చూడటానికి ప్రధానంగా 5 అంశాలు ఉన్నాయి. 1.కన్నప్ప చిత్రంలో భారత దేశ పురణాలను, చరిత్రను, హిందూ ధర్మాన్ని తెలియజేసే అంశాలు ఉండటం. 2.కేవలం మంచు విష్ణు, మంచు మోహన్ బాబు కోసం భారీ తారాగణం ప్రభాస్ వంటి స్టార్స్ నటించడం, వారి పాత్రల ప్రదర్శన. 3.భారీ విజువల్స్, యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ. 4. సినిమా పూర్తిగా న్యూజిలాండ్ లో చిత్రీకరించడం. 5.తొలిసారిగా మంచు విష్ణు సినిమాకు రూ.200 కోట్లకు పైగా వెచ్చించి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడం. సినిమాకు సంబంధించిన కీలక అంశాలుగా చెబుతున్నారు.

కన్నప్ప సినిమా విశేషాలు..
మంచు విష్ణు కన్నప్ప చిత్రానికి ముఖేష్ సింగ్ కుమార్ దర్శకత్వం వహించారు. AVA ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. మంచు మోహన్ బాబు నిర్మాత. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్రగా, అక్షయ్ కుమార్ శివుడిగా, మోహన్ లాల్ కిరాతగా, కాజల్ అగర్వాల్ పార్వతీగా ఈ చిత్రంలో నటించారు. సినిమా ప్రీమియర్స్ ను బట్టి మొదటి భాగం కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం కాస్తా సహనాన్ని పరీక్షించినా, రెండో భాగంలో ప్రభాస్ ఎంట్రీతో సినిమా రేంజ్ మారిపోయిందని, సినిమాలోని యుద్ధ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, విజువల్స్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయని చెబుతుండటం విశేషం.

More from Filmibeat

Read more about: manchu vishunu prabhas kannappa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X