సుజిత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారు గిఫ్ట్.. పవన్ కల్యాణ్ ఖరీదైన వాహనాన్ని ఎందుకు బహుకరించారంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన OG చిత్రం సంచలన విజయాన్ని అందుకొన్నది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అయితే ఈ సినిమా పార్ట్‌ 2 నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి క్రేజీ వార్తలు మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్న నేపథ్యంలో దర్శకుడు సుజిత్‌కు అరుదైన గౌరవాన్ని అందించారు. పవన్ కల్యాణ్ స్వయంగా ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుకరించడం ఫ్యాన్స్‌కు మరింత కిక్ ఇచ్చింది. అయితే ఈ ఖరీదైన కారును సుజిత్‌కు గిఫ్టుగా ఇవ్వడం వెనుక ఓ కారణం ఉంది. ఆ కారణం వెనుక అసలు కథ ఏమిటంటే?

డైరెక్టర్ సుజిత్‌ను ఆహ్వానించి పవన్ కల్యాణ్ విలాసవంతమైన కారు ల్యాండ్ రోవర్ డిఫెండర్ తాళం చెవిని అందించారు. పవన్ కల్యాణ్ నుంచి ఊహించని చర్యకు ఆశ్చర్యపోయిన సుజిత్.. తన అభిమానాన్ని మాటల రూపంలో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కారు బహుకరిస్తున్న సందర్భంగా తీసిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. దాంతో ఇంత ఖరీదైన కారును ఎందుకు బహుకరించారు అనే ప్రశ్న అందరిలోను మెరిసింది.

Pawan Kalyan Gifted Land Rover Defender Car to Sujeeth

అయితే సుజిత్‌కు కాస్ట్లీ కారును ఇవ్వడం వెనుక అసలు కారణం ఏమిటంటే.. OG చిత్రం ఎప్పుడో ప్రారంభమై.. షూటింగులో అవాంతరాలు ఏర్పడ్డాయి. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం.. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వంలో భాగం కావడంతో మరింత బిజీగా మారిపోయారు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఊహించిన దానికంటే ఎక్కువగానే డిలే అయింది. దాంతో బడ్జెట్ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కథ డిమాండ్ మేరకు కొన్ని సన్నివేశాలు జపాన్‌లో చిత్రీకరించాల్సి వచ్చింది. కానీ చిత్ర యూనిట్ మాత్రం బడ్జెట్ లేదని నిర్మోహమాటంగా చెప్పారట.

దాంతో సుజిత్‌కు ఎలాగైనా కొన్ని సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించాలి. ఆ సన్నివేశాలు స్టోరీని ఎక్కువగా ఎలివేట్ చేస్తాయి. కాబట్టి ఆ సీన్లను చిత్రీకరించడంలో ఎలాంటి రాజీ పడకూడదని భావించాడు. అయితే బడ్జెట్ కోసం తన వద్ద ఉన్న ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును అమ్మేసి ఫండ్‌ను క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కారు అమ్మగా వచ్చిన సొమ్ముతో జపాన్‌‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఆ తర్వాత జపాన్‌కు వెళ్లి తాను అనుకొన్న సన్నివేశాలను చిత్రీకరించి సినిమాను కంప్లీట్ చేశాడు.

అయితే ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అయితే ఓజీ సినిమా డబ్బింగ్ జరుగుతున్న సమయంలో పవన్‌కు ఈ విషయం తెలిసిందట. దాంతో సినిమా కోసం కారును అమ్మిన విషయం తెలుసుకొన్నారు. సినిమా పట్ల ఆయన డెడికేషన్, నిబద్దతను చూసి ఆశ్చర్యపోయాడట. అందుకే సుమారుగా 3 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును తానే స్వయంగా పవన్ కల్యాణ్ కొనిచ్చారు. ఈ కారు ఈఎంఐని పవన్ కల్యాణ్ చెల్లించేందుకు సిద్దపడ్డారట. ఇలా తన అభిమానికి ఓ హీరో ఇచ్చిన రేర్ గిఫ్ట్ వెనుక అసలు కథ ఇదే.

OG సినిమా విషయానికి వస్తే.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ నిర్వర్తించారు. ఈ సినిమా థమన్ ఎస్ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా మారింది. ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై రికార్డు స్థాయి వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X