Virupaksha మూవీకి అలాంటి ఎఫెక్ట్.. అందుకే ప్యాన్ ఇండియా రిలీజ్ క్యాన్సిల్!
సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రం ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు కార్తీక్ దండు డైరెక్టర్‌గా సినీ రంగానికి పరిచయం అవుతున్నారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ సినిమాకు బాపినీడు బీ సమర్ఫకుడిగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నారు. కానీ కేవలం తెలుగు భాషలోనే రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయం గురించి నిర్మాత ప్రసాద్, హీరో సాయిధరమ్ తేజ్ వివరణ ఇస్తూ..
విరూపాక్ష చిత్రం ప్రారంభించిన సమయంలో తెలుగుతోపాటు హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అన్ని భాషల్లో కాపీలను సిద్దం చేయలేకపోయాం. సమయంలేని కారణంగా, అలాగే సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ ఉండటం వల్ల హిందీలో రిలీజ్ చేయలేకపోయాం. అందుకే ఈ సినిమాను కేవలం తెలుగులోనే రిలీజ్ చేయాలని నిర్ణయించాం అని ప్రసాద్ అన్నారు.

విరూపాక్ష సినిమా పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయలేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. డబ్బింగ్, రిలీజ్‌కు సంబంధించిన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని సాంకేతిక కారణాలు వల్ల రిలీజ్ చేయలేకపోయాం. వచ్చే వారం నుంచి రిలీజ్‌కు సంబంధించిన పనులను మళ్లీ మొదలుపెడుతాం అని నిర్మాత ప్రసాద్ తెలిపారు.
పాన్ ఇండియా రిలీజ్ చేయలేకపోవడం గురించి సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఇంట గెలిచి రచ్చ గెలిచేందుకు ప్రయత్నిస్తాం. వాస్తవంగా అన్ని భాషల్లో రిలీజ్ చేయాలని అనుకొన్నది వాస్తవమే. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ఏప్రిల్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఆ సినిమాకు నార్త్‌లో ఎక్కువ డిమాండ్ ఉండటంతో ఎక్కువగా థియేటర్లు మాకు లభించలేదు. అందుకే ఈ సినిమాను తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు.
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేశారు. ఆయన శిష్యుడిగా మీరు 100 కోట్లు వసూలు చేసే సినిమా తీశారా? అని అడిగిన ప్రశ్నకు సాయిధరమ్ తేజ్ స్పందిస్తూ.. 100 కాదు.. 200 కోట్ల కలెక్ట్ చేసే సినిమా ఇది. 300 కోట్లకూడా వసూలు చేయడానికి సత్తా ఉంది అని సరదాగా సాయిధరమ్ తేజ్ సమాధానం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











