400 కోట్ల బంగారం కొనుగోలు.. లిక్కర్ నిందితుడితో తమన్నా ఎక్కడికి వెళ్లింది? మిల్కి బ్యూటీ మౌనంపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న 3500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్‌లో సినీ నటి తమన్నా భాటియాకు లింక్ ఉన్న దిగ్బ్రాంతికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ భారీ కుంభకోణంలో అరెస్ట్ అయిన A34 వెంకటేష్ నాయుడితో కలిసి ఎర్రబుగ్గ కారు, స్పెషల్ ఫ్లయిట్‌లో ప్రయాణించినట్టు సోషల్ మీడియాలో వెలుగు చూసిన తమన్నా ఫోటోలు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంలో తమన్నా మౌనం వహించడంపై ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌తో పాటు పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కుంభకోణం, లిక్కర్ మాఫియా వివాదంలో తమన్నా గోల్డ్, జ్యువెల్లరీ బిజినెస్ విషయం కేంద్ర బిందువుగా మారబోతుందా? ఆమెను సిట్ అధికారులు విచారణ కోసం పిలుస్తారా? అనే విషయం ఆసక్తికరమై చర్చకు దారి తీస్తున్నది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణం రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నది. ఈ స్కామ్ పాలిటిక్స్‌కే కాకుండా సినీ పరిశ్రమకు కూడా తాకడంతో ఈ వ్యవహరం మరింత హైలెట్ అవుతున్నది. అయితే కేవలం 5 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వెంకటేష్ నాయుడితో తమన్నాకు ఉన్న సంబంధాలు ఏమిటి? ఆమెతో ఆయనకు ఉన్న లావాదేవీలు ఏమిటి? అతడితో కలిసి ఎక్కడికి వెళ్లింది? ఓ సాధారణ వ్యక్తితో కలిసి అంత సన్నిహితంగా కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలను మీడియా, నెటిజన్లు సంధిస్తున్నారు.

అయితే మీడియా కథనాల్లో కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏమిటంటే? తమన్నాకు గోల్డ్, జ్యువెల్లరి బిజినెస్ ఉంది. అయితే లిక్కర్ స్కామ్‌లో సుమారుగా 400 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆ బంగారాన్ని తమన్నా సంస్థలోనే కొన్నారా? అందుకే వారిద్దరూ కలిసి స్పెషల్ జెట్‌లో ప్రయాణించారా? స్పెషల్ జెట్ ఫ్లయిట్‌లో బంగారం తీసుకెళ్లారా? లేదా భారీగా నగదు ట్రాన్స్‌పోర్టు చేశారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి అని మహా న్యూస్ తన ప్రత్యేక కథనంలో సందేహాలు వ్యక్తం చేయడం మీడియాలో సంచలనం రేపింది.
అయితే వెంకటేష్ నాయుడు టాంజానియాలో గోల్డ్ మైనింగ్‌ను ప్రారంభించాలని అనుకొన్నాడు. ఆ పనులు, ప్రారంభం వ్యవహారాల్లో తమన్నాకు ఏమైనా లింకు ఉందా? వారిద్దరూ విదేశాలకు వెళ్లారా? రాజకీయ నేతలు, బిజినెస్ వర్గాలతో జరిగిన పార్టీ కోసం డ్రెస్ కోడ్ పాటించారా? అనే అనుమానాల్ని మీడియా వ్యక్తం చేస్తున్నది. అయితే తన కంపెనీలో బంగారం కొనుగోలు చేస్తే తమన్నా మౌనం ఎందుకు పాటిస్తున్నది? వెంకటేష్ నాయుడితో తనకు ఉన్న రిలేషన్ గురించి మిల్కీ బ్యూటీ సైలెంట్‌గా ఎందుకు ఉంటున్నారు? అనే విషయంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
కన్నడ రంగంలో వెంకటేష్ నాయుడు సినిమాల నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాడు అనే విషయం కొత్తగా వెలుగు చూసింది. తమన్నాతో కలిసి ఏదైనా సినిమాలు తీయాలనుకొన్నారా? అయితే సినిమాలే తీయడానికి కలిస్తే.. ఎర్రబుగ్గ కారును ఎందుకు ఉపయోగించారు? ఆ కారు ఎవరిది? ప్రోటోకాల్ వాహనాన్ని ఎవరు పంపించారు? తమన్నాతో కలిసి బెంగళూరుకు వెళ్లారా? ఇంకా ఎక్కడికైనా వెళ్లారా? అనే అనుమానాల్ని మీడియాతో సోషల్ మీడియాలో పలువురు వ్యక్తం చేస్తున్నారు.
అయితే లిక్కర్ స్కామ్ కుంభకోణం నిందితులతో తమన్నాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే.. ఏ రకమైన రిలేషన్స్ ఉన్నాయి? ఈ విషయాలపై మిల్కి బ్యూటీ మౌనం ఎందుకు? అనే ప్రశ్నలను సూటిగా మహా న్యూస్ సూటిగా సంధించింది. ఈ కేసు వ్యవహారం ముదురుతుండటంతో తమన్నాను సిట్ అధికారులు విచారణకు పిలుస్తారా? అనే విషయం కూడా మీడియాలో చర్చకు వచ్చింది. ఒకవేళ తమన్నాను విచారణకు పిలిస్తే ఈ కేసులో భారీ ట్విస్టులు బయటకు వచ్చే అవకాశమే కాకుండా ఈ కుంభకోణం మిల్కి బ్యూటీ మెడకు చుట్టుకొనే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











