Varun Tej Wedding ఇటలీలోనే లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి ఎందుకంటే? మీకు కారణం తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటలీలో జరిగే వివాహాం కోసం మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి చేరుకొన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పెళ్లికి సంబంధించిన వివరాలను కొణిదెల ఫ్యామిలీ మీడియాకు రిలీజ్ చేసింది. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలోనే జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే?
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లో జరుగుతున్నది. నవంబర్ 1వ తేదీన జరిగే వీరిద్దరి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇటలీకి ఇప్పటికే చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్, అల్లు అరవింద్‌తో సహా కామినేని ఫ్యామిలీ మెంబర్స్ చేరుకొన్న విషయం తెలిసిందే. ఇటలీలో మెగా, లావణ్య, కామినేని ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఇటలీలో మూడు రోజులపాటు జరిగేలా వివాహ కార్యక్రమాలను షెడ్యూల్ చేశారు. 30 అక్టోబర్ తేదీన కాక్‌టయిల్ పార్టీని నిర్వహిస్తున్నారు. తమ పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులు, అతిథులు, స్నేహితుల కోసం ఈ పార్టీని మెగా ఫ్యామిలీ ఏర్పాటు చేశారు. ఈ రాత్రితో విందు ముగుస్తుంది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లిలో భాగంగా అక్టోబర్ 31వ తేదీన హల్దీ, మెహందీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రెండు కార్యక్రమాల కోసం మెగా ఫ్యామిలీ సిద్దమైంది. అనంతరం నవంబర్ 1వ తేదీన వివాహాం హిందూ మత సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తారు. పెళ్లిని గ్రాండ్‌గా నిర్వహించేందుకు మెగా ఫ్యామిలీ ఏర్పాట్లు చేశారు.

పండితుల వేద మంత్రాల నడుమ పెళ్లి తంతు పూర్తయిన తర్వాత నవంబర్ 1 రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ విందు అనంతరం నవంబర్ 2వ తేదీన గానీ, నవంబర్ 3వ తేదీన హైదరాబాద్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరగడానికి బలమైన కారణం ఉంది. వారిద్దరూ ఇటలీలో షూట్ చేసేటప్పుడు వారి మధ్య పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమ గుర్తుగా వారిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నట్టు సన్నిహితులు తెలిపారు.


Click it and Unblock the Notifications











