జానీ మాస్టర్‌పై రేప్ కేసు వెనుక ఆ సినిమా చిచ్చు.. 6 ఏళ్ల తర్వాత బాధితురాలు షాకింగ్‌గా!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక దాడి కేసు సంచలనం రేపింది. బాధితురాలు తనపై అనేక మార్లు రేప్‌ చేశాడంటూ తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ దాఖలు చేసింది. 2018 నుంచి వారిద్దరి మధ్య కొనసాగుతున్న రిలేషన్‌షిప్ బ్రేకప్ వెనుక కారణం ఏమిటి? ఇప్పుడే ఎందుకు ఆయనపై కంప్లైంట్ చేసిందనే వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెర మీద పాపులర్ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్‌కు పరిచయమైన డ్యాన్సర్‌.. ఆయనతో ట్రావెల్ అవ్వడం ప్రారంభించింది. ఆమెలోని ప్రతిభను చూసి అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చారు. అయితే వారిద్దరి మధ్య గురుశిష్యుల బంధం కంటే ఎక్కవే రిలేషన్‌షిప్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.

Why Victim filed Rape Case on Jani Master after 6 years of cordial Relations

అయితే బాధితురాలు, జానీ మాస్టర్ మధ్య ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక అవకాశాలు కల్పించారు అని యూనియన్ సభ్యులు తెలిపారు. ఆ క్రమంలోనే తాను హీరోగా నటించే యధా రాజా తథా ప్రజా సినిమాలో ఆమెకు హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారు. ఆ సమయంలో జానీ మాస్టర్‌ను ఆకాశానికి ఎత్తేయడం తెలిసిందే.

Why Victim filed Rape Case on Jani Master after 6 years of cordial Relations

ఆగస్టు 22, 2022 సంవత్సరంలో జరిగిన యథా రాజా తథా ప్రజా లాంచింగ్ రోజున జానీ మాస్టర్ వల్లే నాకు ఇలాంటి అవకాశం వచ్చింది. మీరు లేకపోతే నాకు లైఫ్ లేదు అనే విధంగా తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే ఆ సినిమా ఏదో కారణంగా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత మరికొన్ని కారణాల వల్ల వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ జరిగింది.

అయితే ఇంతకు ముందు పెద్ద హీరో సినిమాలో పాటలకు జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అద్బుతంగా కొరియోగ్రఫి చేశారు. అయితే ఆ సదరు హీరో చేస్తున్న సినిమా కోసం ఇచ్చిన ఆఫర్ నుంచి జానీ మాస్టర్‌ను తప్పించి.. ప్రస్తుత బాధితురాలికి అవకాశం ఇవ్వడం ఈ గొడవకు బీజం పడినట్టు సమాచారం. తనకు ఇచ్చిన ఆఫర్‌ను ఆమెకు ఎలా ఇస్తారనే విషయంపై ఆ సినిమా డైరెక్టర్‌తో గొడవ పడ్డారనేది చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్నది.

Why Victim filed Rape Case on Jani Master after 6 years of cordial Relations

పెద్ద హీరో సినిమాలో తనకు వచ్చే అవకాశాన్ని నీవు ఎలా తీసుకొంటారని బాధితురాలితో జానీ మాస్టర్ గొడవ పడటం.. ఆ వివాదంలో భార్య కూడా మితిమీరి ప్రవర్తించారనే విషయం బయటకు వచ్చింది. ఆ గొడవల తర్వాతే జానీ మాస్టర్‌పై కేసు పెట్టాలని ప్రోత్సాహించారు. ఆ క్రమంలో తీవ్రమైన ఆరోపణలతో బాధితురాలు కేసు పెట్టిందనే విషయం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

More from Filmibeat

Read more about: jani master tollywood rape case
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X