విజయ్ దేవరకొండపై పగ బట్టారా? ది ఫ్యామిలీ స్టార్‌పై ఎందుకింత నెగెటివిటీ? దిల్ రాజు కారణమా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్యామిలీ స్టార్ మూవీ తీవ్రమైన నెగెటివిటీ కారణంగా నిరాశనే మిగిల్చింది. ఈ మూవీకి దారుణమైన కలెక్షన్లు రావడం గమనార్హం. ఫ్యామిలీ స్టార్ మూవీని సోషల్ మీడియా వేదికగా చాలా కౄరంగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సాధారణంగానే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు థియేటర్లలో ఆదరణ తక్కువగా లభిస్తుంది. విజయ్ దేవరకొండ సినిమాకు కూడా అదే వర్తిస్తుంది. కానీ సినిమాను చంపేసేంత తీవ్రమైన నెగెటివిటీ మాత్రం ఫామిలీ స్టార్ విషయంలోనే జరుగుతోంది.
ఫ్యామిలీ స్టార్ మూవీకి దక్కిన ఆదరణ సంగతిని పక్కన పెడితే సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేసి నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సినిమాలో ట్రోల్ చేసే సన్నివేశాలు కొన్ని ఉన్నాయి అనేది కాదనలేని సత్యం. అయినప్పటికీ ఇప్పటిదాకా ఇలాంటి దారుణమైన ట్రోలింగ్ ను ఇతర హీరోలెవ్వరు ఫేస్ చెయ్యకపోవడం గమనార్హం. సినిమా కంటే విజయ్ దేవరకొండ పైనే ఎక్కువగా నెగెటివిటీ కనిపిస్తోంది.

నిజానికి లైగర్ డిజాస్టర్ తర్వాత విజయ్ నిరాశలో ఉన్నాడు. ఏదో ఒక రోజు 200 కోట్లు కచ్చితంగా కొడతాను, పెళ్లి చూపులు మూవీ హిట్ అయ్యేదాకా కూడా తను బండిలో ఫుల్ ట్యాంక్ పెట్రోలు కొట్టించుకోలేదని విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఈ నెగెటివిటీకి దారి తీసాయి. ఆయనేదో సినిమా ప్రమోషన్లలో భాగంగా తన మనసులోని మాటను బయట పెడితే, దాన్ని సీరియస్ గా తీసుకొని విజయ్ గత జీవితం గురించి తవ్వడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ గురించి మాట్లాడటం స్టార్ట్ చేశారు. దీంతో స్టార్ హీరోలకు మాత్రమే స్టార్ డం, యాటిట్యూడ్ ఉండాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ బాక్గ్రౌండ్ ఉన్న ఇతర స్టార్ హీరో ఎవరైనా ఇలా 200 కోట్లు, ఫుల్ ట్యాంక్ పెట్రోల్ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చి ఉంటే ఇంత దారుణమైన నెగెటివిటీ వచ్చేదా? అంటున్నారు విజయ్ అభిమానులు.
ట్రోల్స్ అనేవి హద్దుల్లో ఉండాలి గాని సినిమాను చంపేసే విధంగా ఉండకూడదు అంటున్నారు సినిమా పెద్దలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి నిర్మాత దిల్ రాజు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ఏకంగా మైక్ పట్టుకొని థియేటర్ల వద్ద జనాల ఒపీనియన్ తెలుసుకుంటున్నారు ఆయన.

అయితే విజయ్ దేవరకొండ కూడా ఈ ట్రోలింగ్ నేపథ్యంలో సైలెంట్ గా ఉండడం గమనార్హం. ఇటీవల వెల్లడించినట్టుగా ఈసారి హిట్ కొట్టాకే విజయ్ మాట్లాడాలి అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ ఈ ట్రోలింగ్ కు హిట్ ద్వారా మాత్రమే సమాధానం చెప్పగలరు. కాబట్టి అప్పటిదాకా మౌనంగా ఉండడమే మంచిదని అంటున్నారు సినీ విశ్లేషకులు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి టైం బాగా లేనప్పుడు తాడే పామై కాటేస్తుంది అన్న సామెత తీరుగా ఉంది. మొత్తానికి ఇదంతా ఓ వర్గం వారు కావాలనే చేస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. స్వయంకృషితో ఎదిగిన విజయ్ దేవరకొండను ఇలా కావాలని టార్గెట్ చేయడం బాధాకరం. గత కొద్దికాలంగా నిర్మాత దిల్ రాజు కూడా ఈ నెగిటివిటిని ఎదుర్కొంటున్నారు. ఈ సారి ఇద్దరిని కలిపి ట్రోల్ చేయడం సినిమాకు ప్రతికూలంగా మారింది.


Click it and Unblock the Notifications











