విజయ్ దేవరకొండను ‘రౌడీ' అని ఎందుకు పిలుస్తారు? ఆ ట్యాగ్ వెనుక అసలు కథ ఇదే!
Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా పెళ్లి వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 26న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తొలిసారిగా తమ పెళ్లిపై అధికారికంగా స్పందించిన ఈ స్టార్ జంట.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పర్సనల్ లైఫ్, నెట్ వర్త్, లైఫ్‌స్టైల్ వంటి అంశాలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోవిజయ్ దేవరకొండను 'రౌడీ' అని ఎందుకు పిలుస్తారు? ఆ ట్యాగ్ వెనుక అసలు కథ ఇదేంటీ? అనేది ఆసక్తికరంగా మారింది.
యూత్ ఐకాన్‌గా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) పేరు వినగానే అభిమానులకు ముందుగా గుర్తొచ్చేది 'రౌడీ'. ఇది కేవలం సినిమా ఇమేజ్ కాదు.. విజయ్ స్వయంగా నిర్మించుకున్న ఒక ఐడెంటిటీ. తాజాగా రష్మిక మందన్నాతో పెళ్లివేళ.. విజయ్ దేవరకొండకు 'రౌడీ' ట్యాగ్ ఎలా వచ్చింది? ఎందుకు అంత బలంగా పాతుకుపోయింది? అన్నది తాజాగా ఇంట్రెస్టింగ్ గా మారింది.

కుటుంబం నుంచే మొదలైన 'రౌడీ' పేరు
విజయ్ చిన్నప్పటి నుంచే కాస్త అల్లరి, మొండితనం, స్వతంత్ర ఆలోచనలతో ఉండేవాడట. ఇంట్లో వారికి నచ్చని పనులు చేసినప్పుడు సరదాగా తల్లిదండ్రులే 'రౌడీ' అని పిలిచేవారని పలు ఇంటర్వ్యూల్లో విజయ్ స్వయంగా చెప్పాడు. అప్పట్లో సరదాగా వచ్చిన ఆ పేరు.. తర్వాత అతని జీవితానికే బ్రాండ్ అయిపోతుందని ఎవరూ ఊహించలేదు.
విజయ్ కెరీర్‌ను టర్నింగ్ పాయింట్‌గా మార్చింది అర్జున్ రెడ్డి. ఆ సినిమాలో అతని ఇంటెన్స్, రూల్స్ బ్రేక్ చేసే యాంటీ-హీరో పాత్ర యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ దూకుడు, రా యాటిట్యూడ్, బోల్డ్ డైలాగ్స్ ఇవన్నీ విజయ్ రియల్ లైఫ్ పర్సనాలిటీతో కలిసిపోయాయి. అప్పటినుంచి అభిమానులు అతడిని ప్రేమగా 'రౌడీ'అని పిలవడం మొదలుపెట్టారు. ఈ నిక్ నేమ్ ను దూరం పెట్టే ప్రయత్నం చేయకుండా, విజయ్ దాన్ని పూర్తిగా సొంతం చేసుకున్నాడు.
ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరలవుతున్నాయి. 'నన్ను ఇష్టపడే వాళ్లను 'ఫ్యాన్స్' అనడం నాకు కాస్త అసౌకర్యంగా అనిపించింది. అందుకే వాళ్లను 'మై రౌడీ బాయ్స్, మై రౌడీ గర్ల్స్' అని పిలవడం మొదలుపెట్టా. మనల్ని సమాజం ఎప్పుడూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కంట్రోల్ చేస్తుంది. కానీ మనకు నచ్చినట్లు స్వేచ్ఛగా జీవించాలి. ఇతరులను నొప్పించకుండా, మన దారిలో ముందుకు వెళ్లడమే రౌడీయిజం' అని పేర్కొన్నారు.
రౌడీ అనే పేరు ఇక్కడితో ఆగలేదు. విజయ్ 'రౌడీ' పేరునే తీసుకుని తన ఫ్యాషన్ బ్రాండ్ కూడా ప్రారంభించాడు. క్యాప్స్, టీషర్ట్స్ నుంచి ఈవెంట్ థీమ్స్ వరకు ప్రతిచోటా 'రౌడీ' అనే పదమే హైలైట్. ఇది ఒక నిక్‌నేమ్ నుంచి యూత్ మూవ్‌మెంట్‌గా మారిపోయింది. నిజంగా ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన స్టైల్, తన మాట, తన నిర్ణయాలతో స్టార్‌డమ్ సంపాదించాడు విజయ్. ఇదే ఆయనను మరింత 'రౌడీ'గా నిలబెడుతోంది. షూస్ లేకుండా ఈవెంట్స్‌కి రావడం, సింపుల్ డ్రెస్సింగ్, మొహమాటం లేకుండా మాట్లాడే తీరు ఇవన్నీ ఆయన రియల్ పర్సనాలిటీకి అద్దం పడతాయి.


Click it and Unblock the Notifications











