టెంప్ట్ చేస్తున్న ‘వైఫ్, ఐ’.. కిక్కిస్తున్న కొత్త పోస్టర్
'ఏడు చేపల కథ' సినిమాలో టెంప్ట్ రవి పాత్రలో నటించిన నటుడు అభిషేక్ రెడ్డి చేసిన తాజా చిత్రం 'వైఫ్, ఐ'. గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఈ సినిమా అడల్డ్ కంటెంట్‌తో వస్తున్న చిత్రం అని చెప్పకనే చెప్పింది. ఇందులో కూడా శృంగారం శృతిమించినట్లు అనిపించినప్పటికీ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబందించిన మరికొన్ని పోస్టర్లు విడుదల చేసి యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చారు యూనిట్ సభ్యులు.
తాజాగా విడుదలైన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్ కాలిపై హీరో ముద్దు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక హీరోయిన్ అందాల విందైతే వర్ణించడానికి వీలు లేనంతగా ఉంది. బార్యాభర్తల మధ్య ప్రెజెంట్ ట్రెండ్ లో వున్న అసూయ ద్వేషాలు, ఎప్పటికో కనిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవన్ని మించితే వారి జీవితాలు ఎలా వుంటాయనేది చాలా చక్కగా మంచి కంటెంట్ తో ఈ సినిమా రూపొందించామని చెబుతోంది చిత్రయూనిట్.

భర్తని మోసం చేస్తూ భార్య సాగించే రాసలీలల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జీ చరితారెడ్డి నిర్మిస్తున్నారు. రచన, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగ్ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్. వినోద్ యాజమన్య సంగీతం సమకూర్చారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్ట, అపర్ణ ఇతర పాత్రల్లో నటించారు.



Click it and Unblock the Notifications











