Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఏడు చేపల కథ’ హీరో కొత్త సినిమా టీజర్ వచ్చేసింది.. శృంగారం శృతిమించింది
'ఏడు చేపల కథ'.. తెలుగు సినీ ఇండస్ట్రీని మొత్తం తన వైపునకు తిప్పుకున్న సినిమా ఇది. ప్యూర్ అడల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు చూపించారు. దీంతో ఈ సినిమా చర్చనీయాంశం అయిపోయింది. ఈ సినిమా టెంప్ట్ రవి అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది.
ఈయన ఆడవాళ్లను చూస్తే టెంప్ట్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎదురైన విషయాలను వెల్లడిస్తాడు. అదే ఈ సినిమా కథ. 'ఏడు చేపల కథ' టీజర్ ఒక సంచలనం అని చెప్పాలి. ఇందులో చూపించిన శృంగార సన్నివేశాలు మరే సినిమాలో చూపించలేదంటే అతిశయోక్తి కాదు అన్నంతగా చూపించారు. అందుకే ఈ సినిమా అంత హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాతి అడ్డంకులను మాత్రం ఈ చిత్రం దాటలేకపోయింది.

ఈ టెంప్ట్ రవి పాత్రలో నటించిన అభిషేక్ రెడ్డి అనే నటుడు చేసిన తాజా చిత్రం 'వైఫ్, ఐ'. గుంజన్, ఫిదా గిల్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇది కూడా అడల్డ్ కంటెంట్‌తోనే వస్తున్న చిత్రం అని టీజర్ చూస్తే అర్థం అయిపోతుంది. ఇందులో కూడా శృంగారం శృతిమించినట్లు అనిపిస్తుంది.
భర్తని మోసం చేస్తూ భార్య సాగించే రాసలీలల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జీ చరితారెడ్డి నిర్మిస్తున్నారు. రచన, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగ్ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్. వినోద్ యాజమన్య సంగీతం సమకూర్చారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్ట, అపర్ణ ఇతర పాత్రల్లో నటించారు.