Wife i Trailer: శృతిమించిన బోల్డ్ సీన్స్.. అలాంటివన్నీ చుపిస్తూ సెన్సేషన్
రోజు రోజుకూ సినిమాల్లో శృంగార సన్నివేశాలు శృతిమించి పోతున్నాయి. బోల్డ్ కంటెంట్ తో సినిమాలు తీస్తూ అలంటి సినిమాలకున్న క్రేజ్ క్యాచ్ చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు మరీ ఎక్కువైపోయాయి. ఇటీవలే ఇదే కోవలో 'ఏడు చేపల కథ' సినిమా రాగా ఇప్పుడు 'వైఫ్ i' రూపంలో మరో సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

శృతిమించి బోల్డ్ సీన్స్.. వైఫ్ i ట్రైలర్
తాజాగా వైఫ్ i ట్రైలర్ విడుదల చేసి తమ సినిమా ఎలా ఉండబోతోందో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. వైఫ్ i మూవీలో ఆసక్తికర కథాంశంతో పాటు శృతిమించి బోల్డ్ సీన్స్ ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో చూపించిన కొన్ని సన్నివేశాలు అబ్బబ్బో! ఓ తెలుగు సినిమాలో మరీ ఇలానా? అన్నట్లుగా ఉన్నాయి.

పోస్టర్స్‌ని మించి ట్రైలర్.. అన్నీ బూతులే
ప్రెజెంట్ ట్రెండ్‌లో భార్యాభర్తల మధ్య రేకెత్తుతున్న అసూయ ద్వేషాలు, ఆ తర్వాత ఎప్పటికో కనిపించే ప్రేమ దానిలో పొంగుకొచ్చే రొమాన్స్ ఇవన్నీ శృతిమించితే వారి జీవితాలు ఎలా తయారవుతాయనేది చూపించే కోణంలో ఈ సినిమా రూపొందించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్‌ని మించి ఈ ట్రైలర్ ఉంది.

భార్య సాగించే రాసలీలల కాన్సెప్ట్
భర్తని మోసం చేస్తూ భార్య సాగించే రాసలీలల కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ చరిత ఆర్ట్స్, జీఎస్ఎస్‌పీకే స్టూడియోజ్ బ్యానర్లపై జీ చరితారెడ్డి నిర్మిస్తున్నారు. 'నైఫ్ ఈజ్ బెటర్ దెన్ వైఫ్' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. బోల్డ్ కంటెంట్ కారణంగా ఈ సినిమాకు కూడా A సర్టిఫికేట్ వచ్చింది.
Recommended Video
వైఫ్ i విశేషాలు
మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న వైఫ్ i చిత్రానికి రచన, కెమెరా, డైరెక్షన్, ఎడిటింగ్ జీఎస్ఎస్‌పీ కళ్యాణ్. వినోద్ యాజమన్య సంగీతం సమకూర్చారు. రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. అభిషేక్ రెడ్డి, సాక్షి నిదియా భార్యాభర్తలుగా నటించారు. సునీల్ నగరం, సూర్య ఆకొండి, మహేష్ విట్ట, అపర్ణ ఇతర పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications