డ్రగ్స్ ఆరోపణలు రుజువైతే హేమకు భారీ జైలుశిక్ష.. ఎన్ని ఏళ్లు అంటే? 14 రోజుల రిమాండ్!
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. డ్రగ్స్ కేసులో అనేక ఊహాగానాల మధ్య ఆమెను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఆమెను పలు గంటలపాటు విచారించిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెను స్టేట్ హోంకు తరలించారు. అయితే ఈ కేసులో చోటు చేసుకొన్న పరిణామాల వివరాల్లోకి వెళితే..
బెంగళూరు రేవ్ పార్టీలో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ రావడంతో విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు. రెండు నోటీసులకు జ్వరం కారణంగా రాలేనని చెప్పిన ఆమె మూడో నోటీసుకు స్పందించారు. సోమవారం బెంగళూరులో విచారణకు హాజరయ్యారు.

విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొన్నారు. అయితే రేవ్ పార్టీతో సంబంధం లేదంటూ వీడియోలు రిలీజ్ చేసి.. అందర్నీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య హేమను బెంగళూరు పోలీసుల ఎలా ట్రీట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

బెంగళూరులో సుదీర్ఘంగా విచారించిన తర్వాత హేమను 14 రోజులపాటు రిమాండ్ తరలించడం సంచలనంగా మారింది. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరుచనున్నారు. ఆ తర్వాత ఆమెను కస్టడీకి అప్పగించాలని పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

అయితే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చట్టాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో ఆమె నిర్వాహకురాలిగా రుజువైతే భారీగా శిక్ష పడే అవకాశం ఉంది. కనీసం 3 ఏళ్ల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడేలా చట్టాలు రూపొందించారు. అయితే తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో నిందితులను బాధితులిగా పరిగణిస్తారు. కానీ కర్ణాటక చట్టాల ప్రకారం తీవ్రమైన శిక్ష పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











