Madhubala ఆటను రక్తి కట్టిస్తుందా? గేమ్ ఆన్ రిలీజ్ ఎప్పుడంటే?
యువ హీరో, హీరోయిన్లు గీతానంద్, నేహా సోలంకి జంటగా నటిస్తున్న చిత్రం గేమ్ ఆన్ (Game On). కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మిస్తున్నారు. తమ్ముడు దయానంద్ దర్శకత్వంలో అన్న గీతానంద్ హీరోగా నటించడం విశేషంగా మారింది. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భావోద్వేగమైన యాక్షన్ డ్రామా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్, మే నెలల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ...
రథం చిత్రం తర్వాత హీరో గీతానంద్ మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్, దయానంద్ ఇద్దరితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మధుబాల గతంలో ఉన్నడూ చేయని పాత్రలో నటించారు. మధుబాల పాత్రకు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. కార్తికేయ2తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య మీనన్ ఈ సినిమాలో ఎమోషనల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు అని రవి కస్తూరి అన్నారు.

హీరోయిన్ నేహా సోలంకి పెర్ఫార్మెన్స్‌తోపాటు గ్లామర్‌పరంగా ఆకట్టుకుంటారు. శుభలేఖ సుధాకర్, కిరీటి, వాసంతి కీలక పాత్రలో నటించారు. హీరో విశ్వక్‌సేన్ ఇటీవల విడుదల చేసిన టీజర్, అంతకుముందు రిలీజైన పాటలకు భారీ స్పందన ఉంది. హైదరాబాద్ మ్యూజిక్ బ్యాండ్ నవాబ్ గ్యాంగ్ అందించిన సంగీతం సినిమాకు ఎసెట్ అవుతుంది. అనురాగ్ కులకర్ణి, హారిక నారాయణ్ పాడిన రెండో పాట పడిపోతున్నా 2 రోజుల్లో 2 మిలియన్ల వ్యూస్ సాధించింది అని రవి కస్తూరి తెలిపారు.
గేమ్ ఆన్ (Game On) సినిమాకు వస్తున్న స్పందనతో మరింత నమ్మకం పెరిగింది. అరవింద్ విశ్వనాథన్ అద్భుతంగా విజువల్స్ ఇచ్చాడు. ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం అని రవి కస్తూరి అన్నారు.
దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ.. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు.. సక్సెస్ కూడా అవుతున్నాయి. ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయి. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా ఉంటుంది. ట్విస్టులు, ఉత్కంఠతో సాగుతుంది. ఈ సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అని అన్నారు.

నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరిటీ, శుభలేక సుధాకర్ తదితరులు
బ్యానర్స్: కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్
నిర్మాత: రవి కస్తూరి
దర్శకత్వం: దయానంద్
మ్యూజిక్: నవాబ్ గ్యాంగ్, అశ్విన్ - అరుణ్
సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్
డైలాగ్స్: విజయ్ కుమార్ సి.హెచ్
ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్: అభిషేక్ ఎ.ఆర్
ఎడిటర్: వంశీ అట్లూరి
ప్రొడక్షన్ డిజైనింగ్: దిలీప్ జాన్, రాజ్ కమల్
స్టంట్స్: రామకృష్ణన్, నభా స్టంట్స్
కాస్ట్యూమ్స్: మనోజ్
పిఆర్వో: మధు వి. ఆర్


Click it and Unblock the Notifications











