Dhurandhar The Revange: దురంధర్ రికార్డును దురంధర్ 2 బ్రేక్ చేస్తుందా? ఆదిత్య ధార్ బాక్సాఫీస్‌ టార్గెట్ ఎంత?

Dhurandhar The Revange: రణవీర్ సింగ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ (Dhuandar) బాలీవుడ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్, ఇంటెన్స్ మైండ్ గేమ్, పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా విలన్‌గా అక్షయ్ ఖన్నా నటన సినిమాకు హార్ట్‌గా నిలిచింది. అయితే.. తాజాగా ధురంధర్ మూవీని మించేలా సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా... నెట్టింట ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ టీజర్ ను చూస్తే.. దురంధర్ రికార్డును దురంధర్ 2 బ్రేక్ చేస్తుందా? ఆదిత్య ధార్ బాక్సాఫీస్‌ టార్గెట్ ఎంతంటే?

టీజర్ ఎలా ఉందంటే?
ధురందర్ 2 టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. డార్క్ టోన్, రా యాక్షన్, సీరియస్ బ్యాక్‌డ్రాప్‌తో 'రివెంజ్' థీమ్‌ను చాలా పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేశారు. హీరోగా రణవీర్ సింగ్ తన మార్క్ ఎనర్జీతో స్క్రీన్‌ను షేక్ చేస్తున్నాడు. కళ్లలో కోపం, బాడీ లాంగ్వేజ్‌లో ప్రతీకారం.. టీజర్ మొత్తాన్ని ఒంటిచేత్తో నడిపించాడు. ముఖ్యంగా టీజర్ చివర్లో రణవీర్ చెప్పిన 'ఇది కొత్త భారత్... ఇంట్లోకి ప్రవేశిస్తుంది... చంపుతుంది కూడా!' అనే డైలాగ్ గూస్‌బంప్స్ తెప్పించింది.

Will Aditya Dhar break Dhuandar Box Office Records with Dhurandar The Revange

ఆదిత్య ధర్ ఈ సీక్వెల్‌ను హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో డిజైన్ చేస్తున్నారనే విషయం టీజర్ చూస్తే అర్థమవుతుంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, రియలిస్టిక్ స్టంట్స్, డార్క్ కలర్ ప్యాలెట్... అన్నీ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. 1 నిమిషం 12 సెకన్ల టీజర్ మొత్తం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తోనే నడవడం మరో హైలైట్. ఒక్క డైలాగ్‌తోనే క్లైమాక్స్ ఇంపాక్ట్ ఇచ్చారు. టీజర్‌తో పాటు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రణవీర్ సింగ్ వర్షంలో తడుస్తూ బోల్డ్ లుక్‌లో కనిపించాడు. రెడ్ కలర్ డామినేట్ అవుతోంది. ముఖ్యంగా ధురందర్ ది రివెంజ్ ని బోల్డ్‌గా ప్రజెంట్ చేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

అక్షయ్ ఖన్నా రిటర్న్ అవుతాడా?
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. రణవీర్ సింగ్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో ధురంధర్ 2 కాస్ట్‌ను ట్యాగ్ చేస్తూ అక్షయ్ ఖన్నా పేరును కూడా చేర్చడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది. పార్ట్ 1లో రెహమాన్ డెకాట్ పాత్ర క్లైమాక్స్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 2లో ఆయన ఫ్లాష్‌బ్యాక్ సీక్వెన్స్‌లలో కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. అదే జరిగితే... హీరో-విలన్ మైండ్ గేమ్ మరోసారి పీక్స్‌కు వెళ్లడం ఖాయం.

ధురందర్ బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. దాదాపు 4500 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్ డేలో రూ.28.60 కోట్ల నెట్‌తో స్టార్ట్ అయినప్పటికీ, తొలి మూడు రోజుల్లోనే రూ.106.5 కోట్ల నెట్ వసూలు చేసింది. లాంగ్ రన్‌లో అసలు సత్తా చాటిన 'ధురంధర్' ఇండియాలో రూ.895 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో సుమారు 3.55 కోట్ల మంది ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించగా, ఓవర్సీస్ మార్కెట్‌లో 32.75 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, ఈ మూవీ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇక గమనించాల్సిన విషయమేమిటంటే? ధురంధర్ సినిమాను కేవలం హిందిలోనే రిలీజ్ చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చేయకుండా నేరుగా హిందీ వెర్షన్‌లోనే ప్రదర్శించారు. అయినా ధురంధర్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. అయితే ఈసారి ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతున్నది. దాంతో ధురంధర్ సినిమా క్రియేట్ చేసిన రికార్డు కలెక్షన్లను తుడిచిపెట్టే విధంగా దర్శకుడు ఆదిత్య ధార్ టార్గెట్ సెట్ చేశాడా? ఆయన టార్గెట్ ఎంత అనేది సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ క్రమంలోనే 'ధురంధర్: ది రివెంజ్' తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ కావడం అంచనాలను డబుల్ చేసింది. ఈ సినిమా మార్చి 19న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం... పార్ట్ 1 క్రియేట్ చేసిన రికార్డులను ఈ సీక్వెల్ సునాయాసంగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. దురంధర్ రికార్డును దురంధర్ 2 బ్రేక్ చేస్తుందా? పార్ట్ 1 రికార్డుల సునామీని పార్ట్ 2 తో ఆదిత్య ధార్ బ్రేక్ చేయగలడా? ఈ రివెంజ్ డ్రామా ఏ స్థాయిలో దుమ్మురేపుతుందో? తెలుసుకోవాలంటే.. మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X