అల్లు అర్జున్‌కు జైలా? బెయిలా? నాంపల్లి కోర్టు తీర్పుపై టెన్షన్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కోర్టు కేసు వెంటాడుతూనే ఉంది. పుష్ప ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటనలో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం, కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ కేసులో హై కోర్టు నాలుగు వారాల మధ్యంత బెయిల్ ఇవ్వడం తెలిసిందే. అయితే పూర్తిస్థాయి బెయిల్ ఇస్తుందా? లేదా అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలోకి వెళితే..
సంధ్య థియేటర్‌లో పుష్ప 2 మూవీ చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్.. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించడం, ఆ వ్యవహారం తొక్కిసలాటకు దారి తీసిందనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం, అలాగే పుష్ప నిర్మాతలపై కేసు నమోదు చేశారు. అయితే నోటీసులు ఇచ్చి అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు.

అయితే నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్‌ను వెంటనే చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించిన కోర్టు.. ఆయనకు ఊరట కలిగిస్తూ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
అయితే ఈ కేసులో అల్లు అర్జున్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈయన బెయిల్ రద్దు చేయాలని తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలపై విచారణ ఇటీవల ముగిసింది. తీర్పును నాంపల్లి కోర్టు రిజర్వు చేసింది. అయితే ఈ కేసుపై నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించనున్నది. దాంతో అందరి దృష్టి ఈ తీర్పుపడింది.
అల్లు అర్జున్ కేసు రాజకీయంగా ముడిపడి ఉండటంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నది. అలాగే సాధారణ ప్రేక్షకులు క్యూరియాసిటీ, అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. ఐకాన్ స్టార్‌కు బెయిల్ మంజూరు అవుతుందా? లేదా బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? అనేది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది.


Click it and Unblock the Notifications











