జానీ మాస్టర్‌పై అలా.. పూనమ్ కౌర్‌ ఫిర్యాదుపై మరోలా.. యాంకర్ ఝాన్సీ టీమ్ మౌనమేలా?

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ చేసిన ఆరోపణలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. గత కొద్దికాలంగా త్రివిక్రమ్‌పై పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న ఆమె తాజాగా ప్రస్తుతం నేరుగా ఆయన పేరును బయటపెడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించిన ఇండస్ట్రీలో మహిళా నటీనటులపై వేధింపులపై క్రమ శిక్షణ చర్యల కమిటీకి ఆమె ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్యవహారంపై, తన ఫిర్యాదుపై త్వరగా స్పందించి చర్యలు చేపట్టాలని కమిటీ చైర్మన్ ఝాన్సీకి ఓ ప్రశ్న వేశారు. ఈ వ్యవహారంలో యాంకర్, నటి ఝాన్సీ ఎలా స్పందిస్తారనే విషయంపై అందరి దృష్టిపడింది. నటి పూనమ్ కౌర్ బయటపెట్టిన తాజా వివరాల్లోకి వెళితే..

ఆఫర్లు ఇస్తామని తనను వాడుకొన్నారంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఆమె మా(MAA) ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై స్పందించకపోవడంతో చాలా సార్లు పరోక్షంగా సోషల్ మీడియాలో ఓ ప్రముఖ దర్శకుడు తనకు చేసిన అన్యాయం అంటూ పోస్టులు పెట్టారు. కానీ ఎన్నడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే పేరును ఎక్కడా వాడలేదు. కానీ తాజాగా ఆయన పేరును నేరుగా తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీలో వెల్లడించడం సంచలనంగా మారింది.

Poonam Kaur s complaint on Trivikram Srinivas

తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ స్టోరిని పోస్ట్ చేసింది. ఆ పోస్టులో ఏమున్నదనే వివరాల్లోకి వెళితే.. గతంలో కూడా ఓసారి నేను చెప్పాను. ఇప్పుడు కూడా మరోసారి చెబుతున్నాను. నేను ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత ఝాన్సీ గారితో మాట్లాడాను. అయితే ఈ విషయంపై మీటింగ్ ఆలస్యమైంది. మమ్మల్ని డిస్ట్రబ్ చేయవద్దు అంటూ సడెన్‌గా మాట మార్చారు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.

అయితే మా అసోసియేషన్‌కు చేసిన ఫిర్యాదులో నేను ఎవరి పేరు కూడా వెల్లడించలేదని చెబుతున్నారు. కానీ నేను ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశానని క్లియర్‌గా చెబుతున్నాను. ఆయనను కొందరు రాజకీయ నేతలు, సినీ వర్గాలు అండగా నిలబడి రక్షిస్తున్నారు. నేను మహిళ సంఘాలతో కూడా మాట్లాడేందుకు రెడీగా ఉన్నాను. అదే విషయాన్ని నేను ఈమెయిల్‌లో వెల్లడించాను అంటూ పూనమ్ తన పోస్టులో పేర్కొన్నారు.

Anchor Jhansi react on Actress Poonam Kaur

తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీనే కాకుండా ఝాన్సీ టీమ్ అకౌంట్‌లో ఓ వాట్సప్ ఛాట్‌ను రిలీజ్ చేసింది. ఝాన్సీ నుంచి వచ్చినట్టుగా భావిస్తున్న పోస్టులో.. హాయ్ పూనమ్. మీ ఫిర్యాదుపై వినడానికి కమిటీ ఓ ప్రాసెస్‌ను మొదలుపెట్టింది. మీరు కమిటీకి చెప్పాల్సిన విషయాలు మాకు షేర్ చేయండి. అలాగే నాకు ఇలాంటి సమాచారాన్ని వ్యక్తిగతం షేర్ చేయకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఫిర్యాదు గురించి చర్చించడానికి ఓ మహిళా లాయర్‌ను నియమించేందుకు ప్లాన్ చేశాం. ఈ విషయంలో మీరు చూపిస్తున్న సహనాన్ని మేము అభినందిస్తున్నాం అని టీమ్ ఝాన్సీ నుంచి వచ్చిన మెసేజ్‌ను పోస్టు చేశారు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనమ్ కౌర్ చేసిన ఫిర్యాదుపై ఆలస్యం కావడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నాను. అదే జానీ మాస్టర్‌పై ఓ మహిళా డాన్సర్ చేసిన ఫిర్యాదుపై వెంటనే, హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి దానిపై స్పందించారు. ఈ విషయంపై మీరు ఎందుకు జాప్యం చేస్తున్నారు. జానీ మాస్టర్ వివాదంలో మీపై వచ్చిన ఒత్తిడి ఏంటి? ఓ పెద్ద హీరో సపోర్టుగా ఉన్నారంటూ మీరే చెప్పారు. పూనమ్ కౌర్ ఫిర్యాదుపై తగిన సమాధానం ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం వెనుక కారణం ఏమిటో చెప్పగలరా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తున్నది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X