యాంకర్ శ్యామలకు కష్టకాలం.. ఆ కేసులో ఆమెను కూడా అరెస్ట్ చేస్తారా?
తెలుగు బుల్లితెరకి చెందిన చాలా మందిలో ఆఫ్ లైన్ లో కాంట్రవర్సీలు కూడా ఉన్నవారు ఎక్కువే కనిపిస్తారు. కాగా ఒక అనసూయ భరద్వాజ్ అయినా ఒక రష్మీ గౌతమ్ ఇంకా కొందరు ఉన్నారు. అయితే వారి లీగ్ ఒకటి అయితే ఇంకో యాంకర్ మాత్రం ఇపుడు సెపరేట్ లీగ్ అని చెప్పవచ్చు. కాగా ఆ మరో యాంకరే.. టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో కనిపించిన నటి శ్యామల.
ఇపుడు శ్యామల అంటే సినిమాలు పరంగా మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా గట్టిగా వినిపిస్తుంది. గత ఎన్నికలు ముందు సమయం నుంచే సోషల్ మీడియాలో సహా టీవీల్లో తాను కనిపించి పలువురు రాజకీయ నాయకులపై చేసిన సంచలన కామెంట్స్ తో ట్రెండింగ్ లో నిలిచారు. కాగా అక్కడ నుంచి యాంకర్ శ్యామల చాలా అంశాల్లో సోషల్ మీడియాలో హైలైట్ గా నిలుస్తూ వస్తుండడమే కాకుండా పలు కాంట్రవర్సీలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

అయితే ఇటీవల యాంకర్ శ్యామల ఉన్న పార్టీ మద్దతుదారుడు టాలీవుడ్ ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి విషయంలో స్టాండ్ తీసుకోవడంపై పలు విమర్శలు ఆమెపై వచ్చాయి. అయితే అతని తర్వాత ఆమెని కూడా అరెస్ట్ చేస్తారని పలు వార్తలు వచ్చాయి కానీ ఇపుడు ఈ విషయంలో కాకపోయినా మరో కీలక అంశంలో ఆమె అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని పలు రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సీరియస్ ఇష్యూ ట్రెండింగ్ గా నడుస్తుంది. అదే బెట్టింగ్ యాప్స్ విషయంలో పలువులు యూట్యూబర్స్ సహా పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ లని కూడా అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ లు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోగా చాలా మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇక ఈ నేపథ్యంలోనే యాంకర్ శ్యామల వంతు కూడా వచ్చింది. దీంతో ఆమె పోస్ట్ చేసిన పలు బెట్టింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈమెని కూడా అరెస్ట్ చేయాలి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమె పట్ల నెగిటివ్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇవన్నీ చుట్టూ తిరిగి యాంకర్ శ్యామల వరకు కూడా వెళుతుందా లేదా అనేది మాత్రం ఇపుడు వేచి చూడాలి.
ఇక శ్యామల ఇటీవల అయితే మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన భారీ హిట్ చిత్రం విరూపాక్ష సినిమాలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ సినిమా తర్వాత తాను మళ్ళీ యాక్టీవ్ గా రాజకీయాల్లోనే కనిపించారు. అక్కడ నుంచి ఇప్పుడు పలు కాంట్రవర్సీలు తోనే శ్యామల లైఫ్ ఇపుడు రన్ అవుతుంది. తాజాగా ఈ బెట్టింగ్స్ వివాదం చుట్టుకునేలా ఉంది. మరి ఈ కొత్త ఇష్యూ ఆమె వరకు వెళుతుందో లేదో అనేది చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











