దీపిక పదుకోన్‌కు పుట్టబోయేది ఆడ బిడ్డా? మగ బిడ్డా? వేణుస్వామి కాదు.. పాపులర్ జ్యోతిష్కుడి జోస్యం ట్రెండింగ్
ఇండియన్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ కెరీర్ పరంగానే కాకుండా వ్యక్తిగత జీవితంలో మంచి జోష్‌లో ఉన్నారు. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి. సినిమా విజయాలు ఓ పక్క మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంటే.. వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్ లైఫ్‌ను గడిపేస్తూ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నది. అయితే త్వరలోనే పండంటి బిడ్డకు జననం ఇవ్వనున్న దీపిక గురించి ఓ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే..
సినిమా పరిశ్రమలో గతేడాది, ప్రస్తుతం ఏడాది దీపిక బాగా కలిసి వచ్చింది. పఠాన్, ఫైటర్, కల్కి సినిమాలు రికార్డు స్థాయి విజయాలను అందించాయి. ఆమె తన కెరీర్‌లో 1000 కోట్లు సాధించిన చిత్రాల హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆమె నటించిన ఫైటర్, కల్కి సినిమాలు దాదాపు 1000 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే.

దీపిక పదుకోన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. గర్బవతిగా తన సినిమాల ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఎనర్జీటిక్‌గా కనిపించి ఆకట్టుకొన్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్‌తో కలిసి ఉత్సాహంగా కనిపించారు. టీమ్‌తో సరదా సరదాగా ఉన్నారు.
అయితే త్వరలోనే దీపిక పదుకోన్ పండంటి బిడ్డకు తల్లి కాబోతున్నది. అయితే గర్బంలోని బిడ్డ అబ్బాయా? లేదా అమ్మాయా? అనే విషయం గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఓ జ్యోతిష్కుడు మాత్రం తన లెక్కల ప్రకారం ఆమె ప్రసవించేది ఆడ బిడ్డా? మగ బిడ్డా అనేది క్లారిటీ చెప్పేశారు.

దీపిక పదుకోన్ సంతానం గురించి ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, ఫేస్ రీడర్ పండిట్ జగన్నాథ్ గురూజీ మాట్లాడుతూ.. ఆమె, రణ్ వీర్ జాతకం ప్రకారం.. వారికి మగబిడ్డ పుడుతాడు. వారి జీవితానికి యువరాజు అవుతాడు. యువరాజుల ఉండే అబ్బాయి వారికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు అని అన్నారు.
ఇదిలా ఉండగా, మాతృత్వాన్ని ఆస్వాదించేందుకు దీపిక పదుకోన్ సిద్దంగా ఉంది. ఆమె సెప్టెంబర్ 2024 లో ప్రసవిస్తారని వ్యక్తిగత వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె తన ఆరోగాన్ని, కడుపులో ఉండే బిడ్డ ఆర్యొగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొంటున్నారు. స్వామిజీ చెప్పిన ప్రకారం మగ బిడ్డ పుడుతుందా? లేదా ఆడబిడ్డ పుడుతుందా? వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











