AP Elections 2024 పవన్ కల్యాణ్ స్పీచ్ వివాదం.. మహేష్ బాబు రియాక్షన్ ఏంటంటే?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన ప్రసంగాన్ని వివాదాస్పదంగా మార్చడానికి జరుగుతున్న నేపథ్యంలో సినీ పరిశ్రమలో రకరకాల చర్చ జరుగుతున్నది. అయితే సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన వీడియోను కొందరు సర్కూలేట్ చేయడంతో అది వివాదాస్పదంగా మారింది. ఈ వివాదంపై ఇప్పటికే నటుడు వీకే నరేష్ స్పందించి క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ వివాదంపై మహేష్ బాబు రియాక్షన్ ఏమిటనే వివరాల్లోకి వెళితే..
ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో సిద్దాంతపరమైన విభేదాలే ఉండాలి. అంతేకాని రాజకీయ కక్షలు ఉండకూడదు. కానీ వైఎస్ జగన్ మాత్రం వ్యక్తిగత కక్షలకు, వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడు. నేను రాష్ట్రంలోని సమస్యలపై ప్రశ్నిస్తే.. ఆయన నాలుగు పెళ్లాలంటూ నాపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు అని కామెంట్ చేశారు.

అయితే తన ప్రసంగంలో పవన్ కల్యాణ్.. గతంలో సినీ పరిశ్రమ నుంచి ఎంతో గొప్ప నటులు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్, కృష్ణ లాంటి వాళ్లు చట్ట సభల్లో ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కృష్ణ గారు కాంగ్రెస్‌లో ఉండి సిద్దాంతపరంగా విభేదించారు. అయితే ఏనాడు కృష్ణను గానీ, నాగేశ్వరరావు అక్కినేనిని గాని ఇబ్బంది గానీ, వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదు అని అన్నారు.
అయితే పవన్ కల్యాణ్ స్పీచ్‌ను ఎడిట్ చేసి.. కొందరు సోషల్ మీడియాలో దుష్పచారం చేశారు. దాంతో పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూపులు రకరకాల పోస్టులు పెట్టి వివాదంగా మార్చారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ గారు గొప్ప విలువలు ఉన్న నటుడు, రాజకీయ నేత.. ఆయనపై ఎలాంటి తప్పు రాతలు పెట్టకండి.. అలాంటి ఉంటే వెంటనే డీలీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయితే పవన్ కల్యాణ్ చేసిన స్పీచ్‌పై మహేష్ బాబు మౌనంగా ఉన్నారు. అయితే ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ఇలాంటి విషయంపై స్పందించే అవకాశం కచ్చితంగా ఉండకపోవచ్చు. అయితే తన ఫ్యాన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండమని.. అంతర్దతంగా సంకేతాలు పంపించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య వివాదా తీవ్రతను తగ్గించడానికి నటుడు నరేష్ ప్రయత్నాలు ప్రారంభించారు. పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. పవన్ కల్యాణ్ ఏపీకి భవిష్యత్.. ఎన్డీఏ కూటమి భారీ విజయం అందుకొంటుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











