అప్పుడు మహేష్‌ను చార్మినార్ నిలబెట్టింది.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు కలిసి వస్తుందా?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హరిహరవీరమల్లు టీజర్‌ను సర్‌ప్రైజ్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. రాబిన్ హుడ్ క్యారెక్టర్‌లో , పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లో పవన్ కళ్యాణ్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ఆయన నుంచి ఏం కోరుకుంటారో అలాంటి విందు భోజనాన్ని అందించే ప్రయత్నం చేశారు మేకర్స్. రిలీజైన కాసేపటికే హరిహరవీరమల్లు టీజర్ ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. పాజిటివ్ రివ్యూలు కూడా రావడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
హరిహరవీరమల్లు టీజర్‌ను జాగ్రత్తగా గమనిస్తే హైదరాబాద్‌లోని ఫేమస్ హిస్టరికల్, టూరిస్ట్ స్పాట్ చార్మినార్‌ను చూడొచ్చు. చార్మినార్ వీధుల వెంట నడిచొస్తూ.. వేటకు వెళ్లే సింహం లాగా బల్లెం తిప్పుతూ పవన్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ చార్మినార్ చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ నడుస్తోంది. అది కూడా సూపర్‌స్టార్ మహేశ్ బాబు సినిమాతో పోలిక పెడుతూ. ఆ చిత్రం మరేదో కాదు ఒక్కడు.

ప్రిన్స్ కెరీర్‌లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానముంది. అప్పటి వరకు లవర్ బాయ్‌గా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ కథలు చేసుకుంటూ వెళ్తున్న మహేశ్ బాబును కంప్లీట్‌గా మేకోవర్ చేసి.. యూత్‌లో భారీ ఫాలోయింగ్‌ను తీసుకొచ్చింది. కబడ్డీ ఆటకు, రాయలసీమ పగలు, ప్రతీకారాన్ని జోడించి క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
మహేశ్ యాక్టింగ్, మేనరిజమ్స్, పాటలు , భూమిక అందాలు , ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కలెక్షన్లతో పాటు ఏకంగా 8 నంది అవార్డులను దక్కించుకుని మహేశ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. పలు భాషల్లోనూ డబ్, రీమేక్ అయి అక్కడా బంపర్ హిట్ కొట్టింది. గతేడాదితో ఒక్కడు రిలీజై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టింది.
ఒక్కడు మూవీకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది చార్మినార్ సెట్. కథ మొత్తం పాతబస్తీలోనే నడుస్తుంది. హీరో ఇల్లు వుండేది అక్కడే. అయితే చార్మినార్ వద్ద భద్రత, ఇతర కారణాలతో ప్రభుత్వం చిత్రీకరణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో మొత్తం ఓల్డ్ సిటీని, ప్రత్యేకించి చార్మినార్ సెట్‌ను వేయాల్సి వచ్చింది. ఇందుకోసం అప్పట్లో ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఆర్ట్ డైరెక్టర్ అశోక్ నేతృత్వంలో హైదరాబాద్ నగర శివార్లలోని గోపన్నపల్లె గ్రామంలో నిర్మాత రామానాయుడికి చెందిన 10 ఎకరాల్లో చార్మినార్ , పాతబస్తీలోని ఇళ్లు, దుకాణాల సెట్ వేశారు. దాదాపు 300 మంది కార్మికులు, ఇతర సాంకేతిక నిపుణులు మూడు నెలల పాటు కష్టపడి ఈ సెట్ వేశారు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ''హరేరామా హరేకృష్ణ '' , '' చెప్పవే చిరుగాలి '' పాటలను ఇక్కడే షూట్ చేశారు. ఈ సెట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూనే వుంటారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ కావడంతో మరోసారి ఒక్కడు సినిమా, చార్మినార్ ప్రస్తావన మళ్లీ వచ్చింది. నాడు మహేశ్‌ను స్టార్‌గా నిలబెట్టినట్లే.. నేడు పవన్ కళ్యాణ్‌కు కూడా సాలిడ్ హిట్ గ్యారెంటీ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ చార్మినార్ సెంటిమెంట్ గనుక వర్కవుటైతే .. మిగిలిన హీరోలు , దర్శకులు కూడా చార్మినార్‌పై ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే చిత్ర పరిశ్రమ సెంటిమెంట్ చుట్టూ ఎక్కుగా తిరుగుతుంది కాబట్టి.


Click it and Unblock the Notifications











