రాంచరణ్ పెద్ది టార్గెట్.. నిర్మాతలపై ఎగ్జిబ్యూటర్ల తిరుగుబాటు
తెలుగు సినిమా పరిశ్రమలో పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలంటూ డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు డిమాండ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించడం భారీ చర్చకు దారి తీసింది. సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన రెంట్ ప్రాతిపాదికన కాకుండా కలెక్షన్లలో పర్సెంటేజీ సిస్టమ్‌ను తీసుకు రావాలని డిమాండ్ చేయడం సినిమా ఇండస్ట్రీని రెండు వర్గాలు విడగొట్టేలా చేసింది. నిర్మాతలు ఒకవైపు.. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మరో వైపు చీలిపోవడంతో ఇండస్ట్రీలో సరికొత్త సంక్షోభం నెలకొనే ప్రమాదం కనిపిస్తున్నది. అయితే రాంచరణ్ నటించిన పెద్ది సినిమా రిలీజ్‌కు ఈ వివాదం నెలకొనడం అత్యంత ఆసక్తికరమైన పరిణామంగా మారింది. అయితే ఈ వివాదం వెనుక అసలు కారణం ఏమిటంటే?
సింగిల్ థియేటర్ ఓనర్లు, సినిమా ఎగ్జిబ్యూటర్లు సమావేశం నిర్వహించడం సంచలనం రేపింది. ఈ కార్యక్రమంలో ఏషియన్ సునీల్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, డిస్టిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ శిరీష్ తదితరులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా మేము పర్సంటేజ్ సిస్టమ్ తేవాలని డిమాండ్ చేస్తున్నాం. చాలాసార్లు చర్చలు జరిపాం. అయితే మా డిమాండ్ వర్కవుట్ కాలేదు. అందుకే మే 1వ తేదీ నుంచి పర్సంటేజ్ విధానంలో సినిమాలను ప్రదర్శించి సింగిల్ థియేటర్లను కాపాడుకొంటాం అని ఏషియన్ సునీల్ అన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తే రెంట్ ఇచ్చే ఆనవాయితీ కొనసాగుతున్నది. అయితే రెంట్ ఇవ్వడం వల్ల థియేటర్లకు గిట్టుబాటు కావడం లేదు. దాంతో వందల కొద్ది సినిమా హాళ్లు మూతపడుతున్నాయి. కాబట్టి ఎగ్జిబిటర్లకు లాభం చేకూరితేనే వాటి మనుగడ ఉంటుంది. మాకు నిర్మాతలతో గానీ, ఇతర వ్యక్తులతో గానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు. సింగిల్ థియేటర్ల మనుగడనే ముఖ్యం. మేము థియేటర్లను మూసి వేయడం లేదు. ఎవరైతే పర్సంటేజ్ విధానంలో సినిమాలు ఆడిస్తారో వారికి మా థియేటర్లు ఇస్తాం అని పలువురు ఎగ్జిబ్యూటర్లు స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా సినిమాల ప్రదర్శన విషయంలో పర్సంటేజీ విధానం కొనసాగుతున్నది. నార్త్ ఇండియాలో, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇతర ప్రాంతాల్లో పర్సంటేజ్ విధానం కొనసాగుతున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ విధానం కొనసాగడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మల్టీ ప్లెక్స్‌లో సినిమాలు ప్రదర్శిస్తే రెంట్ కాకుండా పర్సంటేజ్ విధానంలో రెవెన్యూను చెల్లిస్తున్నారు. మల్టీప్లెక్స్‌లకు ఒక న్యాయం.. సింగిల్ థియేటర్లకు మరో న్యాయం ఎందుకు? మాకు కూడా పర్సంటేజ్ విధానంలో చెల్లింపులు ఉండాలని సింగిల్ థియేటర్ ఓనర్లు డిమాండ్ చేశారు.
అయితే ఎగ్జిబ్యూటర్ల సమావేశం అనంతరం సమస్య విషమంగా మారుతుండటంతో టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశానికి ఏర్పాటు చేయడం ట్విస్టుగా మారింది. అయితే ఎగ్జిబ్యూటర్ల డిమాండ్‌ను నిర్మాతలు ఆమోదిస్తారా? రెంట్ పైనే సినిమాల ప్రదర్శన ఉంటుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో నాగవంశీ, అల్లు అరవింద్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, యూవీ ప్రొడక్షన్ తదితరులు ఈ ప్రెస్ మీట్‌లో పాల్గొనే అవకాశం ఉంది.
అయితే నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల మధ్య నెలకొన్న సంక్షోభం, వివాదం నేపథ్యంలో పెద్ది సినిమా సెంటర్ పాయింట్‌గా మారింది. త్వరలో భారీ రేంజ్‌లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న రాంచరణ్ సినిమాకు ముందు ఇలాంటి డిమాండ్ లేవనెత్తడంపై రకరకాల ఊహాగానాలు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. గతంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌కు ముందు కూడా ఇలాంటి డిమాండ్, వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం చివరకు ఎలాంటి ముగింపు పలుకుతుందనే విషయం భారీ చర్చకు దారి తీసింది.


Click it and Unblock the Notifications