ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ.. ఏపీ పోలీసులు ఆర్జీవిని అరెస్ట్ చేస్తారా?

సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నేతల ఫోటోలను మార్పింగ్ చేసి వారి ప్రతిష్టకు భంగం కల్పించారనే ఆరోపణలపై నమోదైన కేసులో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒంగోలులోని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో హాజరయయారు. తమ అభిమాన నేతల ప్రతిష్టను కించపరిచేలా వ్యవహరించాడంటూ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నోటీసులు అందుకొన్న ఆయన పోలీసుల ముందు విచారణలో పాల్గొన్నాడు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీలోని ప్రముఖ రాజకీయ నేతల జీవితాలకు సంబంధించిన కథా నేపథ్యంగా రూపొందిన వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో వర్మ చేసిన ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి. తన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. ఆ ఫోటోలపై వారి మద్దతు దారులు, నెటిజన్లు అభ్యంతరం తెలుపుతూ ట్రోల్ చేశారు. ఆ సమయంలో ఆయనకు అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడంతో ఈ వివాదానికి అంతంగా ప్రాధాన్యం లభించలేదు.

Ram Gopal Varma

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పవర్ చేపట్టిన తర్వాత వారిపై తప్పుడు రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించడ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఒంగోలుతోపాటు పలు ప్రాంతాల్లో రాంగోపాల్ వర్మపై కేసులు నమోదు అయ్యాయి.

తనపై కేసులు నమోదు కావడంతో ఏపీ సీఐడీ అధికారుల నుంచి నోటీసులు అందుకొన్నారు. విచారణకు హాజరు కావాలంటూ జూలై 22వ తేదీన ఏపీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించకుండా కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకొని విచారణకు హాజరుకాకుండా, అలాగే అరెస్ట్ కాకుండా సేఫ్ కాగలిగారు. అయితే ఆ సమయంలో తన సినిమా పనులు కారణంగా హాజరు కావడం లేదు. త్వరలోనే హాజరు అవుతాను అని సమాధానం ఇచ్చారు.

ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ గుట్టు చప్పుడు కాకుండా ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. నేరుగా ఎలాంటి హడావిడి లేకుండా పోలీసు స్టేషన్‌లోకి వెళ్తూ మీడియా కెమెరాకు చిక్కారు. మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబు దాటవేసి అధికారుల ముందు హాజరయ్యారు. అయితే ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు పోలీసులు సంధిస్తారు? వాటికి వర్మ సమాధానం ఏం చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే గతంలో పోసాని కృష్ణ మురళి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని.. రాంగోపాల్ వర్మను కూడా అరెస్ట్ చేస్తారా? ఫోటోల మార్పింగ్ వ్యవహారం కేసులో తీవ్రత ఎంత అనే విషయాలపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆర్జీవిని అరెస్ట్ చేయడం తప్పదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X