15000 కోట్ల విలువైన ఆస్తి హాంఫట్.. సైఫ్ ఆలీ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ!
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్‌కు కాలం కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు. వ్యక్తిగత జీవితంలో వరుసగా భారీ దెబ్బలు తగులుతుండటంతో అటు శ్రేయోభిలాషులను, అభిమానులక ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవల అగంతకుడి దాడిలో వెన్నుముకకు తీవ్రగాయమై హాస్పిటల్‌లో చేరిన ఆయన ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. అయితే ఆ గాయం నుంచి కోలుకొంటున్నారని అనుకొంటుండగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో గట్టి ఝలక్ ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
సైఫ్ ఆలీ ఖాన్ విలువైన ఆస్తులకు సంబంధించిన విషయంలో మధ్యప్రదేశ్‌కు ెందిన కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ 2014లో నోటీసులు జారీ చేశారు. పటౌడీ ఫ్యామిలీకి వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను శత్రువుల సంపదగా పరిగణించింది. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ సైఫ్ కుటుంబం మధ్య ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు స్టే విధించింది.

మధ్యప్రదేశ్‌లో సైఫ్ ఆలీ ఖాన్ కుటుంబానికి చెందిన ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఆస్తుల్లో ఫ్లాగ్ స్టాఫ్ హౌజ్, నూర్ ఎస్ సబా ప్యాలేస్, దారుసలెం, హబిబీ బంగ్లా, ఆహ్మదాబాద్ ప్యాలేస్. కొహెఫిజా ప్రాపర్టీ తదితర ఆస్తులను ప్రభుత్వం శత్రువుల సంపదగా గుర్తించడం చర్చనీయాంశమైంది. అయితే దాదాపు 10 సంవత్సరాలుగా కోర్టులో ఈ కేసు కొనసాగుతున్నది.
అయితే పటౌడీ ఆస్తుల కేసుపై ఉన్న స్టే విధింపుపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. శత్రువుల ఆస్తిగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకకు ఉన్న ప్రాపర్టీస్‌పై స్టేను ఎత్తివేసింది. దాంతో పెద్ద మొత్తంలో ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్తాయని పేర్కొన్నాయి. జస్టిస్ వివేక్ అగర్వాల్ ఇచ్చిన తీర్పు మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.

అయితే ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లే వివాదాస్పద ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలుగా లెక్కిస్తున్నారు. వీటి విలువ సుమారుగా 15000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాకు వచ్చారు. ఈ ఆస్తులన్నీ భోపాల్ ప్రాంతంలోి కొహెఫిజా నుంచి చిక్లోడ్ వరకు వ్యాపించి ఉన్నట్టు సమాచారం. ఈ తీర్పుపై సైఫ్, ఆయన తల్లి షర్మిలా టాగోర్ సవాల్ చేస్తూ అప్పీలేట్ అథారిటికి 30 రోజుల్లో పిటిషన్ దాఖలు చేసుకోవడానికి వెసలుబాటు కల్పించారు.
ఇదిలా ఉండగా, ఇటీవల బంగ్లాదేశ్‌కు చెందిన అగంతకుడు జరిపిన దాడిలో సైఫ్ ఆలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి జరిగిన సంఘటన నేపథ్యంలో వెంటనే ఆయనను లీలావతి హాస్పిటల్‌కు తరలించారు. నాలుగు రోజులపాటు వైద్య చికిత్స అందించారు. మంగళవారం ఆయనను డిశ్చార్జి చేయడంతో తన నివాసానికి చేరుకొన్నారు. వెంటనే ఆయనకు ఇలాంటి తీర్పు రావడం దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయింది.


Click it and Unblock the Notifications











