ఇండియన్ 2, శంకర్‌పై మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్.. రాంచరణ్ గేమ్ ఛేంజర్‌పై అలాంటి భయంతో!

శంకర్ షణ్ముగం అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ.. డైరెక్టర్ శంకర్ అంటే ఠక్కున గుర్తొస్తారు. భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. సామాజిక బాధ్యతకు కమర్షియల్ హంగులు అద్ది ఇండియన్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేసిన గ్రేట్ డైరెక్టర్ శంకర్. అప్పుడెప్పుడో జెంటిల్మెన్ నుంచి నేటి భారతీయుడు -2 వరకు ఒకటే ఫార్ములాతో సినిమాలు తీసి బ్లాక్‌బస్టర్‌లు కొట్టారు శంకర్. తీసింది తక్కువ సినిమాలు అయినా తరతరాలు చెప్పుకునే పేరును సంపాదించారు. హీరోలు రాజ్యమేలే చిత్ర పరిశ్రమలో దర్శకుడికి స్టార్‌ స్టేటస్‌ను తెచ్చిన అరుదైన డైరెక్టర్.

సోషల్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ వచ్చే సినిమాలను జనాలు బోర్‌గా ఫీల్ అవుతారు.. కానీ శంకర్ మాత్రం దానికి కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తారు. శంకర్ తీసే సినిమాల్లో అడుగడుగునా భారతీయత, దేశభక్తి కనిపిస్తాయి. అవినీతి, లంచగొండితనంపై శంకర్ తీసిన చిత్రాలు ఆయనకు ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. కోయంబత్తూరులో పుట్టిన శంకర్.. నటుడు కావాలనే లక్ష్యంతో మద్రాస్ మహానగరంలో అడుగుపెట్టారు. కానీ విధి ఆయనను దర్శకత్వం వైపు నడిపించింది.

Will Shankar s Indian 2 result impact on Ram Charan s Game Changer

తమిళ అగ్ర నటుడు , ఇళయదళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ వద్ద దర్శకత్వంలో శంకర్ ఓనమాలు దిద్దుకున్నారు. అనంతరం జెంటిల్‌మెన్‌తో మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా మారాడు. రోటీన్ రాబిన్‌హుడ్ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేసి సూపర్ హిట్ కొట్టారు శంకర్. అనంతరం ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఐ వంటి భారీ విజువల్ వండర్స్‌ను చిత్ర పరిశ్రమకు అందజేశారు.

థింక్ బిగ్ అన్నదే శంకర్ సక్సెస్ స్టోరీ అంటారు సినీ విశ్లేషకులు. సామాజిక సమస్యలు ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయనే విషయాన్ని తన సినిమాలలో చూపించారు. రోబోట్స్ తయారీ ఏనాటికైనా మానవాళిని కబళిస్తుందని తన రోబో లో చూపించారు శంకర్. యంత్రానికి ఆలోచించే శక్తి వచ్చినప్పుడు .. మనిషిని మించిపోయినప్పుడు అంతా వినాశనమేనని ఆయన స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందిన వస్తువుల వల్ల ఎలాంటి ప్రమాదాలు కలుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.

Will Shankar s Indian 2 result impact on Ram Charan s Game Changer

అయితే మారుతున్న ప్రేక్షకుల అభిరుచిని కాకుండా తనదైన శైలిలో సినిమాలు తీయడం వల్ల శంకర్‌కు ఆడియెన్స్‌తో ఉన్న కనెక్టీవిటీని కోల్పోయాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియన్ 2 సినిమా చూసిన తర్వాత అత్యంత అవుట్ డేటేడ్ సబ్జెక్ట్ చేశాడేంటి? కథలో దమ్ము లేదు. స్క్రీన్ ప్లే దారుణంగా ఉంది. శంకర్ అంటే పాటలు గ్రాండియర్‌గా ఉంటాయి. కానీ ఇండియన్ 2లో అసలు పాటలే సరిగా లేవు. ఇలా చేస్తే గేమ్ ఛేంజర్ సినిమా పరిస్థితి ఏమిటనే అనుమానాలను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

అయితే శంకర్‌ టాలెంట్‌తో సంబంధం లేకుండా గేమ్ ఛేంజర్ మూవీ కేవలం రాంచరణ్ స్టామినా మీదే నడుస్తుంది. వినయ విధేయ రామ సినిమా డిజాస్టర్ అయినా ఆ మూవీ 90 కోట్ల గ్రాస్ రాబట్టింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కథ కాస్త బాగుంటే చాలూ ఆ సినిమాకు ఢోకా ఉండదు. ఇండియన్ 2 సినిమా ఇంపాక్ట్ గేమ్ ఛేంజర్‌పై ఉండదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X