Macbeth Play Telugu: రంగభూమిపై ఇంగ్లీష్ 'బాహుబలి'.. షేక్ స్పియర్ డ్రామాకు సూపర్బ్ రెస్పాన్స్

ప్రముఖ ఇంగ్లీష్ కవి విలియం షేక్ స్పియర్ (William Shakespeare) గురించి పుస్తకాలు కొద్దిగా చదివే వారికైన తెలిసిన మహోన్నత వ్యక్తి. ఆయన ఆంగ్ల కవి అయినప్పటికీ విలియం షేక్ స్పియర్ రచనలు ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

ఇంగ్లాండు జాతీయ కవిగా గుర్తింపు పొందిన విలియం షేక్ స్పియర్ ను బార్డ్ ఆఫ్ అవాన్ గా పిలుస్తారు. ఆయన రచనల్లో ఎంతో లోతైన భావం, సందేశం ఉంటుంది. ఎన్నో గొప్ప రచనలతో ప్రాముఖ్యత సాధించిన విలియం షేర్ స్పియర్ రచించిన నాటకాన్ని ఏకంగా 2 రోజులపైటు హైదరాబాద్ లో ప్రదర్శించి సత్తా చాటారు.

William Shakespeare Macbeth Play In Telugu In Hyderabad Rangabhumi

చాలా భాషల్లో: పాపులర్ ఇంగ్లీష్ రైటర్ విలియం షేక్ స్పియర్ కవి మాత్రమే కాకుండా నాటక రచయిత, నటుడు. నేటి తరం ఆయన్ను గొప్ప ఆంగ్ల రచయితగా భావిస్తారు. అలాంటి విలియం షేక్ స్పియర్ 17వ శతాబ్ధంలో రచించిన నాటకపుస్తకం 'మక్‍బెత్' (Macbeth). ఈ నాటకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ఇప్పటికే చాలా భాషల్లో అనువాదం కూడా అయింది. పలు భాషల్లో ఈ స్టోరీ ఆధారంగా వేలకుపైగా వరల్డ్ వైడ్ గా నాటకాలు ప్రదర్శించారు. ఏళ్లు గడుస్తున్న ఈ 'మక్‍బెత్' నాటకానికి ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు.

William Shakespeare Macbeth Play In Telugu In Hyderabad Rangabhumi

30 మందితో: ఈ పుస్తకం ఆధారంగా 2015లో 'మక్‍బెత్' మూవీ కూడా తెరకెక్కించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. అలాంటి ఈ కథను తాజాగా హైదరాబాద్ లో రంగస్థలంపై ఆవిష్కరించారు భాగ్యనగర కళాకారులు. హైదరాబాద్ లోని రంగభూమిలో 'మక్‍బెత్' నాటక ప్రదర్శనను 30 మంది కళాకారులతో ఆగస్టు 3, 4 (గురు, శుక్రవారం) తేదిల్లో రెండురోజులపాటు ప్రదర్శించారు.

William Shakespeare Macbeth Play In Telugu In Hyderabad Rangabhumi

ప్రశంసలు: గొప్ప రచన అయినటువంటి 'మక్‍బెత్' నాటకం ఒరిజినల్ ఫ్లేవర్ ఏమాత్రం పోనివ్వకుండా కళ్లకు కట్టినగా రంగస్థలంపై ఆవిష్కరించారు. కథలోని సందేశాన్ని సవివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఇందులోని నటీనటులు పాత్రల్లో జీవించి ఒదిగిపోయారు. వేషధారణ సైతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ నాటకంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నేటి కాలంలో కూడా ఇలాంటి నాటకాలను ప్రదర్శించిన తీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

William Shakespeare Macbeth Play In Telugu In Hyderabad Rangabhumi

తెలుగు రూపం: కాగా ఈ నాటకం గ్లామిస్ రాజు, డంకన్ సింహాసనానికి వీర విధేయుడైన మక్‍బెత్ ప్రధాన పాత్రతో ఉంటుంది. ఈ ఇంగ్లీష్ నాటకానికి రాజీవ్ వేలిచేటి, రాఘవ తెలుగు రూపాన్ని (Macbeth Play Telugu) తీసుకురాగా వికాస్ చైతన్య దర్శకత్వం వహించారు. సూర్య మ్యూజిక్ అందించారు. సాయి లీల కో డైరెక్టర్ గా వ్యవహరించారు.

William Shakespeare Macbeth Play In Telugu In Hyderabad Rangabhumi

ఇంగ్లీష్ బాహుబలి: 'మక్‍బెత్' నాటకానికి సంధ్య రెడ్డి, వంశీ, ప్రణీత్ అనిల్, హేమంత్, అనూష, సందీప్, సాయి లీల వస్త్రధారణ సిద్ధం చేశారు. తెలంగాణ భాష సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బ్రిడ్జ్ థియేటర్ నాటకాన్ని సమర్పించారు. అయితే విలియం షేక్ స్పియర్ రచనల్లో 'మక్‍బెత్' నాటకాన్ని ఇంగ్లీష్ బాహుబలిగా పోలుస్తారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X