Don't Miss!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- News కాకినాడలో పవన్ పై జగన్ విమర్శల్లో తడబాటు..! పాలకొల్లులో పోటీ, నాలుగో సీటు...
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అన్నీ ఆ మెసేజ్‌లే.. చెత్త కామెంట్లు ఆపండి.. క్లాస్ పీకిన యంగ్ హీరోయిన్
సోషల్ మీడియా బాగా విస్తరించడం నేటి తరం హీరోయిన్స్ ని ఓ వరంగా మారింది. ఈ వేదికగా ఎప్పటికప్పుడు తమ ఫిట్ నెస్, అందం వగైరా తాలూకు ఫొటోలను అందరి ముందుంచి అందాల విందులిస్తున్నారు. అయితే ఈ పిక్స్ చూసి మురిసి పోయేవారు కొందరైతే.. వాటిపై తమకు తోచిన కామెంట్స్ చేస్తూ సదరు హీరోయిన్లకు చిర్రెత్తేలా చేసివారు ఇంకొందరు. ఏదేమైనా ఎలాంటి కామెంట్స్ వచ్చినా ముద్దుగుమ్మల అందాల విందు మాత్రం అస్సలు తగ్గటం లేదు. తాజాగా ముంబై భామ మాళవిక శర్మ ఓ హాట్ ఫొటోతో కవ్విస్తూనే నెటిజన్లకు చురకలంటించడం హాట్ టాపిక్ అవుతోంది.
నేల టికెట్ భామ
తెలుగులో నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ. ఈ చిత్రంలో రవితేజతో సరసాలాడిన ఈ భామ తన అందం, అభినయంతో యువ గుండెలకు గ్యాలం వేసినప్పటికీ ఆ తర్వాత ఆశించిన మేర సినిమా ఛాన్సులు దక్కించుకోలేక పోయింది.
అప్పట్లో యాక్టీవ్‌గా ఉంటూ
నేల టికెట్ సినిమా సమయంలో మాళవిక శర్మ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేది. ఎప్పటికప్పుడు తన ఫొటోలతో హంగామా చేసేది. ఓ వైపు సినిమా ఛాన్సులు రాకపోవడం, పైగా క్రమంగా సోషల్ మీడియాకు దూరమవడంతో ఆమెను దాదాపుగా మర్చిపోయారంతా. మళ్లీ ఇప్పుడు సడెన్‌గా తన హాట్ పిక్ తో దర్శనమిచ్చి నెటిజన్లకు పెద్ద క్లాస్ పీకింది ఈ బొద్దుగుమ్మ.
బాడీ షేమింగ్ గురించి కామెంట్స్
బేసిక్ గా ఓ మోడల్ అయిన మాళవిక శర్మ తన శరీరాకృతిపై వస్తున్న కామెంట్లకు చురకలంటించింది. ప్రెసెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా తన హాట్ ఫొటోతో మైమరిపించింది. అంతేకాదు ఆ అమ్మాయి బొద్దుగా ఉంది.. ఈ అమ్మాయి సన్నగా ఉంది అంటూ మీ చెత్త కామెంట్లు ఆపేయండి అంటూ పెద్ద కాప్షన్ పెట్టింది. బరువు పెరిగానంటూ తనపై కామెంట్స్ వస్తున్న కారణంగానే తాను ఇన్ని రోజులు ఫొటోలు అప్ లోడ్ చేయలేదని పేర్కొంది.
సన్నగా అయినా లావుగా అయినా ఓకే కానీ..
తాను సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఏం ప్రాబ్లెమ్ లేదు గానీ.. తనపై కామెంట్స్ చేయడమే పెద్ద ప్రాబ్లెమ్ క్రియేట్ చేస్తోందని తెలిపింది మాళవిక. ఇక మాళవిక ఫొటో విషయానికొస్తే.. నల్లటి స్లీవ్ లెస్ టాప్, మిలట్రీ గ్రీన్ షార్ట్ ధరించిన ఈమె అందాల విందు చేసింది. ఎద అందాలు, తొడల సౌందర్యం చూసి అట్రాక్ట్ అవుతూ తెగ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.