వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్: హీరోయిన్లతో విజయ్ హంగామా ఎక్కడో తెలుసా..?

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్'. యూత్ ఆడియన్స్‌కి కిక్కిచ్చేలా ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి.

ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మేరకు వైజాగ్ సిరిపురం లోని గురజాడ కళాక్షేత్రాన్ని వేదికగా ప్రకటించారు. ఈ వేడుకకు చిత్ర దర్శకనిర్మాతలతో పాటు విజయ్ దేవరకొండ, నలుగురు హీరోయిన్స్ రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, క్యాథెరిన్ ట్రెసా హాజరై సందడి చేయనున్నారు.

World Famous Lover pre release event Details

ఇకపోతే టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తుండటంతో యువత అంతా ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 190 షోలకు గాను ఇప్పటికే బుక్ మై షోలో 120 షోలు ఫుల్ అయ్యాయి.

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ద్వారా మరోసారి యూత్ ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తున్నాడు విజయ్. చిత్రంలో విజయ్ సరసన రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఇజబెల్లా లీట్ హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ అందించిన బాణీలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు మేకర్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X