హీరోయిన్ ముందే విజయ్ దేవరకొండ లుంగీ లూస్.. అందరూ చూస్తుండగానే రౌడీ స్టార్.. రాశీ ఖన్నా ఫీలింగ్స్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఇంటెన్స్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన రాశీ ఖన్నా, ఇసాబెల్లా, క్యాథెరిన్ ట్రెసా, ఐశ్వర్య రాజేష్ నటించారు. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఫ్యాన్స్ హంగామా.. సందడి చేసిన స్టార్
ఈ వేడుకకు విజయ్ దేవరకొండతో పాటు 'వరల్డ్ ఫేమస్ లవర్' యూనిట్ అంతా పాల్గొంది. వైజాగ్ ఆడియన్స్ పెద్దఎత్తున హాజరై హంగామా చేశారు. వేదిక ప్రాంగణమంతా రౌడీ ఫ్యాన్స్‌తో కళకళలాడింది. ఇక ఈ వేడుకలో విజయ్ దేవరకొండ వేషధారణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఎప్పటిలాగే వేదికపై విజయ్ దేవరకొండ..
ఎప్పటిలాగే వేదికపై విజయ్ దేవరకొండ వేదికపై మాట్లా గారడీ చేస్తూ వైజాగ్ ఆడియన్స్‌లో జోష్ తెప్పించారు. ఈవెంట్‌లో తనకు అందించిన బొకేలను ఆడియన్స్ మీదకు విసిరేస్తూ ప్రత్యేకత చాటుకున్నారు. లుంగీ కట్టుకొని, సాధారణ షర్ట్ వేసి.. కాళ్లకు హవాయి చెప్పులు ధరించి రైతు బిడ్డలా వచ్చి విజయ్ దేవరకొండ బాగా అట్రాక్ట్ చేశాడు.

సడెన్‌గా మనోడి లుంగీ లూస్.. పక్కనే ఉన్న రాశీ ఖన్నా
విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ మాటలతో హుషారు తెప్పిస్తుండగా.. సడెన్‌గా మనోడి లుంగీ లూస్ అయింది. అది గమినించి వెంటనే సర్దుకున్నాడు రౌడీస్టార్.
ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న రాశీ తెగ సిగ్గు పడుతూ తనలో తానే నవ్వుకుంది. లుంగీని గట్టిగా బిగించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అదే వేదికపై రాశీ ఖన్నాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు.

వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ కిక్
మొత్తానికైతే విజయ్ స్పెషల్ వేషాధారణ, రాశీ అందాలు ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఈ లుంగీ ఎపిసోడ్ వైజాగ్ ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది. అంతేకాదు విజయ్ మాటలు, అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది వేదిక ప్రాంగణం.
Recommended Video

'వరల్డ్ ఫేమస్ లవర్'
కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో 'వరల్డ్ ఫేమస్ లవర్' పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











