‘వరల్డ్ ఫేమస్ లవర్’ ట్రైలర్ ఎప్పుడంటే..?
రౌడీ స్టార్, టాలీవుడ్ సెన్సేషన్, యూత్ స్టార్ ఇలా ఏ ట్యాగ్‌తో పిలవాలో తెలీదు కానీ.. పిలిచేది మాత్రం విజయ్ దేవరకొండనే అని తెలిసిపోతోంది. అంతటి ఫాలోయింగ్ సంపాదించిన టాలీవుడ్ హీరో.. కోలీవుడ్, బాలీవుడ్‌లోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. సినిమాలు హిట్టైనా, ఫట్టైనా ఫలితాలతో సంబంధం లేకుండా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. చివరగా డియర్ కామ్రేడ్ నిరాశ పరిచినా.. ఎక్కడా స్పీడు తగ్గకుండా దూసుకుపోతున్నాడు.
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ పెంచేస్తున్నాడు విజయ్. తన సినిమాలకు ఏ రేంజ్‌లో పబ్లిసిటీ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన దైన శైలిలో ప్రత్యేకంగా కొత్త కొత్త పద్దతుల్లో సినిమాను ప్రమోట్ చేస్తుంటాడు. సినిమాలోని తనకు భిన్న ప్రపంచాలున్నాయని తెలిసేట్టుగా.. మొదటి ప్రపంచలోని ఐశ్వర్యా రాజేశ్, రెండో ప్రపంచలోని ఇసబెల్లాను, మూడో ప్రపంచలోని కేథరిన్‌ను పరిచయం చేస్తూ వస్తున్నాడు.

తాజాగా రిలీజ్ చేసిన మూడో ప్రేమకథకు సంబంధించిన పోస్టర్‌లో ట్రైలర్ డేట్‌ను కూడా ప్రకటించేశాడు. ఫిబ్రవరి 6న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతోన్నట్లు తెలిపాడు. ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, రాశీ ఖన్నా, క్యాథరిన్, ఇసబెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











