World Famous Lover Twitter Review.. రౌడీ హీరో సిక్స్ కొట్టేశాడ్రో

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్'గా నేడు (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చివరగా డియర్ కామ్రేడ్ అంటూ ఆడియెన్స్‌ను పలకరించి అంతగా మెప్పించలేకపోయాడు. అయితే ఇదే తన చివరి ప్రేమకథా చిత్రమని వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్‌లో చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మరి ప్రేమికుల రోజున వచ్చిన ఈ ప్రేమ కథా చిత్రమ్ గురించి ట్విటర్‌లో ఏమంటున్నారో ఓ సారి చూద్దాం.

World Famous Lover Twitter Review

బజ్ లేదు.. కానీ బుకింగ్స్ ఆన్ ‌ఫైర్

ఎందుకో ఏమో గానీ వరల్డ్ ఫేమస్ లవర్ మీద ముందు నుంచీ బజ్ క్రియేట్ కాలేదు. ఒక్క పాట కూడా క్లిక్ కాలేదు.. టీజర్ కూడా అర్జున్ రెడ్డి మాధిరిగానే ఉందంటూ నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. దీనికి తోడు విజయ్ ప్రసంగాలు కూడా అంతే నీరసంగా ఉన్నాయి. మునుపటి ఆ జోష్ కనిపించడం లేదు. అయినా సరే బుకింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాయి. కేవలం ఇక్కడే కాదు చెన్నైలోనూ వరల్డ్ ఫేమస్ లవర్‌కు టిక్కెట్లు బాగానే తెగుతున్నాయి.

వచ్చాడు హిట్ కొట్టాడు..

డియర్ కామ్రేడ్ నిరాశ పరిచిన విజయ్ దేవరకొండ ఈ సారి మాత్రం గట్టిగానే కొట్టినట్టు కనిపిస్తున్నాడు. ట్విట్టర్‌లో మాత్రం ఓ రేంజ్‌లో టాక్ నడుస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చాడు హిట్ కొట్టేశాడంటూ ఓనెటిజన్ కామెంట్ చేశాడు.

సెన్సార్ టాక్..

వరల్డ్ ఫేమస్ లవర్ సెన్సార్ రిపోర్ట్ కూడా అదిరిపోయిందని సమాచారం. విజయ్ ఇరగ్గొట్టేశాడని టాక్. సెన్సార్ సభ్యులు సినిమా సూపర్ హిట్ అన్నట్టు వినికిడి. తాజాగా ట్విట్టర్ కూడా అదే చెబుతోంది. ఈసారి రౌడీ హీరో పాసైపోయాడన్నమాట.

అదెవ్వరూ ఊహించలేదు..

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా మొత్తం అదిరిపోయిందని, అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వేరే రేంజ్ అని తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఉంటుందని టాక్. ఇక ఇదే సినిమాకు ప్లస్ అవుతుందని సమాచారం.

Recommended Video

World Famous Lover Is My Last Love Story Says Vijay Devarakonda | ఇదే నా చివరి లవ్ స్టోరీ!

ఫస్టాఫ్ అదిరిపోయింది..

ఇప్పుడే సినిమాను చూశాను.. ఫస్టాఫ్ పూర్తయిందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సిక్స్ కొట్టేశామ్‌రో అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విజయ్ తన నటనతో లాక్కొచ్చాడు..పండుగ మొదలైందని ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X