నా ప్రపంచమే అతను.. కొద్దిరోజుల్లోనే మీ ముందుంచబోతున్నా: రాశిఖన్నా
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్'. యువతకు కావాల్సిన అన్ని అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన నలుగురు అందాల భామలు ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, కాథరిన్ ట్రెసా, రాశి ఖన్నా నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ నలుగురు హీరోయిన్స్ ఒక్కొక్కరినీ పరిచయం చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ మేరకు చిత్రంలో వారి వారి పాత్రలను కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లా, కాథరిన్ ట్రెసా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసిన యూనిట్ సభ్యులు.. తాజాగా రాశిఖన్నా లుక్ రివీల్ చేశారు.

ఈ పోస్టర్‌ని సోషల్ మీడియా వేదికగాపంచుకున్న రాశిఖన్నా.. 'మీట్ మై 'వరల్డ్ ఫేమస్ లవర్' గౌతమ్' అని పోస్ట్ చేస్తూ ఇతన్ని ప్రేమికుల రోజు మీ ముందుంచుతా అని తెలిపింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, రాశి కెమిస్ట్రీ సూపర్‌గా కనిపిస్తోంది. చిత్రంలో యామినిగా రాశిఖన్నా నటిస్తుండగా, ఆమె లవర్ గౌతమ్‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.
సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నారు.


Click it and Unblock the Notifications