#WorstTeamSVP ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. సర్కారు వారి పాట నిర్మాతలకు మహేష్ ఫ్యాన్స్ వార్నింగ్
గత మూడేళ్లుగా స్టార్ హీరోల అభిమానులు తమ అభిమాన నటులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లాక్‌డౌన్స్ కారణంగా వాయిదాలు పడిన షూటింగులు, రిలీజ్‌లను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. గత రెండేళ్లుగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఊగిపోతున్నారు. మహేష్ బాబు సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులు తమ ఫేవరేట్ హీరో సినిమా గురించి అప్‌డేట్స్ ఇవ్వకపోవడంపై #WorstTeamSVP అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణం ఏమిటంటే?

సరిలేరు నీకేవ్వరు సక్సెస్ తర్వాత
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు విడుదలైన దాదాపు రెండున్నర ఏళ్లు కావొస్తున్నది. జనవరి 2020లో రిలీజ్ తర్వాత పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా షూటింగు పలుమార్లు వాయిదా పడటంతో ఫ్యాన్స్ అసహనంతో ఊగిపోయారు.

రెండేళ్ల తర్వాత మహేష్ మూవీ
వాస్తవానికి జనవరి 2022లో సర్కారు వారీ పాట రిలీజ్ కావాల్సింది. అయితే RRR కోసం తమ సినిమాను వాయిదా వేస్తున్నామని స్వయంగా మహేష్ బాబు ప్రకటన చేయడంతో ఫ్యాన్స్ నిరుత్సాహపడ్డారు. అయితే థర్డ్ వేవ్ తర్వాతైనా సర్కారు వారీ పాట రిలీజ్ అవుతుందనుకొన్న అభిమానులకు యూనిట్ శుభవార్తను అందించింది. సర్కారు వారి పాట సినిమాను మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా తమ హీరో మూవీ గురించి కనీసంగా కూడా ప్రమోషన్ చేయకపోవడంతో ఫైర్ అవుతున్నారు.

షూటింగ్ పూర్తి కాలేదనే రూమర్
అయితే ఫిలింనగర్‌లో రూమర్ ప్రకారం.. సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కొంత షూటింగ్ చేయాల్సి ఉందనే రూమర్ బయటకు రావడంతో అభిమానుల కోపం మరింత పెరిగిపోయింది. దానికి తోడు పాటలు, ట్రైలర్లు లాంటి విషయంలో అప్‌డేట్స్ కూడా ఇవ్వకపోవడంపై #WorstTeamSVP హ్యాష్ ట్యాగ్‌తో రంగంలోకి దిగారు.

సర్కారు వారి పాటకు ప్లానింగ్ లేదు..
సర్కారు వారి పాట సినిమా అప్‌డేట్స్ విషయంలో సరైన ప్లానింగ్ లేదు. ప్రమోషన్స్ లేవు. ఇంకా 26 రోజులే మిగిలి ఉంది. ఇంకా సినిమా షూటింగ్ పెండింగ్ ఉందనే మాట వినిపిస్తున్నది. కనీసం సినిమా గురించి ఎలాంటి వార్తలు లేకుండా మా సహనాన్ని పరీక్షిస్తున్నారు అని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై శివాలెత్తుతున్నారు. సీవీపీ సినిమా ప్రొడ్యూర్స్ #WorstTeamSVP హ్యాష్ ట్యాగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు అంటూ నెటిజన్లు, మహేష్ అభిమానుల ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు అంటూ
#WorstTeamSVP హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తూ.. డియర్ మైత్రీ మూవీస్.. మీరు ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు. మా హీరో మహేష్ బాబుపై భారీగా అంచనాలు ఉన్నాయి. రెండేళ్ల తర్వాత మహేష్ అన్నయ్య సిల్వర్ స్క్రీన్‌పైకి వస్తున్నాడు. దయచేసి కొంచెం ఫ్యాన్స్‌కు గౌరవం ఇవ్వండి అంటూ అభిమానులు పోస్టుల పెడుతున్నారు.

సర్కారు వారి పాటలో..
నటీనటులు: మహేష్ బాబు, కీర్తీ సురేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
రచన, దర్శకత్వం: పరుశురాం
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట
సినిమాటోగ్రాఫర్: ఆర్ మాది
ఎడిటింగ్: మార్తాండే కే వెంకటేష్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్
రిలీజ్ డేట్: 2022-05-12


Click it and Unblock the Notifications











